Big Stories

KS Bharat: వికెట్ కీపర్ భరత్‌కి స్థాన చలనమా?

Srikar Bharat Likely To Be Dropped From IND Vs ENG: టీమ్ ఇండియాలో దొరక్క దొరక్క స్థానం దొరికిన తెలుగు క్రికెటర్ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కి స్థాన చలనం తప్పదనే కామెంట్లు నెట్టింట వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టులకి ఎంపికైన భరత్ మూడో టెస్టు జట్టు 11 మందిలో ఉండటం డౌటే అంటున్నారు.

- Advertisement -

తొలి టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భరత్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. టీమ్ ఇండియాని గెలిపించడానికి అశ్విన్‌తో కలిసి చేసిన పోరాటం అందరి ప్రశంసలను అందుకుంది. అశ్విన్‌తో కలిసి 57 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. అప్పటివరకు బ్యాటింగ్ రాదని చెప్పిన వాళ్ల నోళ్లు మూయించాడు. నిజానికి తను ఉండి, మ్యాచ్‌ని గెలిపించి ఉంటే మాత్రం చరిత్రలో నిలిచిపోయేవాడు.

- Advertisement -

కానీ అదృష్టం కలిసి రాలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు అరుదుగా వస్తుంటాయి. అలాంటప్పుడే క్రికెటర్ల పేర్లు తళుక్కుమని మెరుస్తాయి. ఆ బ్రేక్‌ని పట్టుకుని, భవిష్యత్తులో అల్లుకుపోవాలి. కానీ అనూహ్యంగా తను అవుట్ అయిపోయాడు. తర్వాత రెండో టెస్ట్ మ్యాచ్‌లో 17, 6 పరుగులు మాత్రమే చేసి, నిరాశ పరిచాడు.

ఈ నేపథ్యంలో మూడో టెస్ట్ మ్యాచ్‌లో తన చోటు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తుదిజట్టులో చోటు కోసం యువవికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్, ఆరంగ్రేటం మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడు. మూడో టెస్టులో తనకేమైనా టీమ్ ఇండియా అవకాశం ఇస్తుందా? అనేది అందరి మదిలో మెదిలే ప్రశ్నగా మారింది.

Read More: Ravichandran Ashwin: అశ్విన్‌కి.. ఇదే ఆఖరి సిరీస్ నిజమేనా? బుమ్రాపై ప్రశంసలు..

రిషబ్ పంత్ గాయపడటం, ఇషాన్ కిషన్ అందుబాటులో లేకపోవడం భరత్‌కి వరంగా మారింది. అయితే అందివచ్చిన అవకాశాలను తను సద్వినియోగం చేసుకోవడం లేదు. ప్రస్తుత కాలంలో మారిన పరిస్థితుల రీత్యా వికెట్ కీపర్‌కి కూడా బ్యాటింగ్ రావల్సిందే. ఇదొక నిబంధనగా మారిపోయింది. మరోవైపు రెండింటా అద్భుతాలు చేస్తున్న ప్రతిభావంతులు లైనులో ఉన్నారు. వారిని దాటి వచ్చిన అవకాశాన్ని భరత్ అందిపుచ్చుకోలేక పోతున్నాడు.

భారత్ ఏ టీమ్‌లో మంచి బ్యాటింగ్ యావరేజ్ ఉన్న భరత్, సరిగ్గా జాతీయజట్టులోకి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నాడు. ఇంతవరకు ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల్లో ఒక్క ఆఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. గత ఏడాది ఆస్ట్రేలియా సిరీస్‌లో 4 టెస్ట్ మ్యాచ్‌‌లు ఆడి 101 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 44 అత్యధిక స్కోరుగా ఉంది.

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్లో సైతం భరత్ 5, 23 పరుగుల స్కోర్లకే అవుటయ్యాడు. అయితే భరత్‌ని తీస్తే మాత్రం టీమ్ ఇండియా తీవ్ర విమర్శలు ఎదుర్కునేలా ఉంది. ఎందుకంటే శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌లకు అన్ని అవకాశాలిచ్చి భరత్‌ని ఇలా తప్పించడం కరెక్ట్ కాదనే కామెంట్లు మొదలయ్యాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News