Big Stories

Soaked Mangoes: మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టి తింటే ఏమవుతుందో తెలుసా..?

What Happens After Eating Soaked Mangoes: వేసవి కాలంలో దొరికే పండ్లలో మామిడి పండ్లు అంటే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. మామిడి పండ్లలో ఉండే రకరకాల పండ్లు అంటే చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా రసాలు, బంగినపల్లి మామిడి పండ్లు అయితే చాలా ఫేమస్ అనే చెప్పాలి. అయితే మామిడి పండ్లను వేసవిలోని వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లచల్లగా తిని సేదతీరుతుంటారు. వేసవిలో రోజురోజుకు ఎండల వేడిమి మరింత పెరిగిపోతుంది. దీంతో ప్రజలంతా జ్యూస్ లు, ఫ్రూట్స్ తినడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా మామిడి పండ్లు తినడానికి ఇష్టపడుతున్నారు.

- Advertisement -

మామిడి పండ్లను తినడం వరకు బాగానే ఉన్నా.. వాటిని చాలా మంది చాలా రకాలుగా తింటుంటారు. వీటిని తినడానికి కూడా ఓ విధానం ఉంటుంది. కొంత మంది మామిడి పండ్లను మార్కెట్లో కొని తీసుకువచ్చి డైరెక్ట్ గా తింటుంటారు. మరికొందరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటుంటారు. ఇంకొంతమంది అయితే మామిడి పండ్లను నీటిలో నానబెట్టుకుని తింటుంటారు. అయితే నీటిలో ఎందుకు నానబెట్టుకుని తినాలి అనే ప్రశ్న చాలా మందికి ఎదురైంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

మామిడి పండ్లను ఎలా తినాలి అని నిపుణులను అడిగితే వారు నీటిలో నానబెట్టుకుని తినాలనే చెబుతున్నారు. ఎందుకంటే మామిడి పండు తొక్కలో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుందట. ఇది శరీరానికి హాని కలిగిస్తుందట. మామిడి పండు నుంచి శరీరానికి అందే పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాలను కోల్పోతుందట. అయితే దీనికి అడ్డుకోవడానికి మామిడి పండ్లను నీటిలో నానబెట్టుకుని తినాలని అంటున్నారు.

Also Read: Obesity: బరువు పెరుగుతున్నారా? అధిక బరువు వల్ల వచ్చే అనారోగ్య సమస్యలివే.. !

నీటిలో మామిడి పండ్లను నానబెట్టడం వల్ల అందులోని ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. అంతేకాదు తొక్కలో ఉండే రసాయనాలు కూడా తొలగిపోతాయట. అంతేకాదు ఇవి ఆరోగ్యానికి బదులుగా కీడు చేస్తాయని, చర్మ సమస్యలకు గురయ్యేలా కూడా చేస్తాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు మలబద్ధకం వంటి సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల మామిడి పండ్లను నీటిలో నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News