E-Paper
Advertisement

Obesity: బరువు పెరుగుతున్నారా? అధిక బరువు వల్ల వచ్చే అనారోగ్య సమస్యలివే.. !

Obesity: బరువు పెరుగుతున్నారా? అధిక బరువు వల్ల వచ్చే అనారోగ్య సమస్యలివే.. !
Advertisement

Obesity: ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఊబకాయం అనేది అనేక వ్యాధులు రావడానికి కారణమవుతుంది. అధిక బరువును నియంత్రించకపోతే శారీరక, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అధిక బరువు వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె సంబంధిత వ్యాధులు :
దేశ వ్యాప్తంగా చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. లక్షలాది మంది గుండె జబ్బులతో మరణించడానికి ప్రధాన కారణంగా ఉబకాయం అని చెబుతున్నారు డాక్టర్లు. అధిక బరువు వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఊబకాయం ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

Advertisement

శ్వాస సంబంధిత వ్యాధులు: అధిక బరువు ఉన్న వారికి శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. బరువు ఎక్కువగా ఉండే వారు గాలిని అందరిలాగా సులువుగా తీసుకోలేరు. వీరికి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, ఆస్తమాతో పాటు ఇతర శ్వాసకోశ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్థూలకాయం ఉన్నవారిలో ఆస్తమా మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందట.

కీళ్ల సమస్యలు: స్థూలకాయం ఎముకలు, కీళ్ల సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా వ్యక్తిగత గాయాల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక బరువుతో బాధపడేవారు ఎముకలు, కీళ్ళ వ్యాధుల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుందిని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

కిడ్నీ వ్యాధి: అధిక బరువు వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, మూత్ర పిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మూత్రపిండాల వైఫల్యంకు ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఊబకాయం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడటానికి అవకాశం ఉంటుంది.

Also Read: మెరిసే ముఖం కోసం ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి!

కాలేయ వ్యాధి: తీవ్ర ఊబకాయం ఉన్నవారిలో చాలా మంది ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతుంటారు. కాలేయంపై మచ్చలు రావడానికి స్థూలకాయం ఒక కారణంగా చెబుతారు. దీని ద్వారా కాలేయం పనితీరు తగ్గుతుంది. ఇది కాలేయం దెబ్బతినడానికి కారణం అవుతుంది.

అధిక బరువు శరీరంలోని మొత్తం ప్రసరణ వ్యవస్థపై ఒత్తిడి కలిగిస్తుంది. దీంతో మెదడులో స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. అజీర్ణం సమస్యకు ఊబకాయం కారణం అవుతుంది. అధిక బరువు వల్ల టైప్ -2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉంటుంది.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×