Types of Rotis for Weight Loss: పెద్దవారి నుంచి మొదలుకుని యువత వరకు బరువు కొంచెం పెరిగినా డైట్ ఫాలో అవ్వాలనే ఆలోచనలో పడుతున్నారు. ముఖ్యంగా యువత బరువు తగ్గి స్లిమ్ గా కనిపించాలని చాలా విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో డైట్ లో పండ్లు, ఆకుకూరలు, జ్యూస్ లు వంటివి చేర్చుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా రోజులో ఒకసారి అయినా చపాతీ తినాలి అని చూస్తున్నారు. ఈ తరుణంలో వారు కేవలం గోధుమ పిండితో చేసిన రోటీనలు మాత్రమే తింటుంటారు. అయితే ఏ రోటీలను తింటే బరువు తగ్గుతారు అనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. రోటీలను చాలా రకాల పిండిలతో చేసుకోవచ్చు.
రాజస్థాన్ ప్రజలు తరచూ రోటీలు తినే వారి జీవనం సాగిస్తుంటారు. అందులో వారు సజ్జలతో తయారు చేసిన రోటీలు తింటుంటారు. ఇక పంజాబ్ వాసులు అయితే మైదా పిండితో తయారు చేసిన రోటీలను తింటుంటారు. ఇలా దేశంలో చాలా చోట్ల చపాతీలనే ఆహారంగా తీసుకునే వారు ఉన్న విషయం తెలిసిందే. అయితే బరువు తగ్గడానికి ఈ రెండింటి కంటే చాలా మంచి రోటీలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
శరీర బరువు తగ్గించడంతో చపాతీ కీలక పాత్ర పోషిస్తుంది. రోటీ పిండిలో ఉండే పోషకాలు శరీరానికి అందడం వల్ల బరువును తగ్గించి ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. తక్కువ కేలరీలు, మైక్రో న్యుట్రియంట్లు కలిగిన రోటీలు తింటే వెంటనే బరువు తగ్గవచ్చు. అయితే అవి ఏ పిండితో తయారు చేసినవి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: West Nile Virus Symptoms: దోమల ద్వారా వెస్ట్ నైల్ వ్యాప్తి.. అసలు ఈ వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏంటి ?
గోధుమ పిండి రొటీలు :
మన దేశంలో ఎక్కువగా గోధుమ పిండితో తయారు చేసిన రోటీలను తింటారు. అయితే గోధుమ పిండి రోటీలలో 70 నుంచి 80 వరకు కేలరీలు ఉంటాయట. అంతేకాదు ఇందులో విటమిన్ బి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
రాగి పిండి రోటీలు :
రాగి పిండితో చేసిన రోటీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ రోటీలను తినడం వల్ల బరువు తగ్గి ఎముకలు ఆరోగ్యంగా తయారవుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. రాగి పిండితో చేసే రోటీల్లో 80 నుంచి 90 కేలరీలు ఉంటాయి.
Also Read: The healing power of hiking: హైకింగ్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
జొన్న పిండి రోటీలు :
జొన్న రోటీలలో 50 నుంచి 60 కేలరీలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి, కేలరీలను అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. జొన్న రోటీల్లో అధిక ఫైబర్, గ్లూటెన్ రహిత స్థాయిలు తక్కువగా ఉంటాయి.
మల్టీగ్రేన్ రోటీలు:
అన్ని రకాల ధన్యాలతో తయారు చేసే మల్టీగ్రేన్ రోటీల్లో 80 నుంచి 100 కేలరీలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఫైబర్ అధికంగా శరీరానికి అందుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరం బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయి.