Almonds Benefits: బాదంను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఇవి మంచి రుచిని కలిగి ఉంటాయి. అంతే కాకుండా వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. బాదం తరుచుగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. బాదం పప్పులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కాంపౌడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతే కాకుండా వీటిని తినడం వల్ల చర్మంతో పాటు కళ్లు, జుట్టుకు కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయి.
బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యానికి మేలు:
బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతే కాకుండా ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో కూడా ఉపయోగపడతాయి. అంతే కాకుండా బాదంలో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
బరువు తగ్గడం:
బాదంపప్పులో ఉండే ఫైబర్ , ప్రోటీన్లు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. ఇవి మీకు చాలా కాలం పాటు కడపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ఫలితంగా ఆకలి చాలా వరకు తగ్గుతుంది. తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది. బరువు తగ్గడానికి బాదం ఇలా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా బాదంలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణక్రియను కూడా పెంచుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు బాదం తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఎముకలకు బలం:
బాదంలో ఉండే కాల్షియంతో పాటు మెగ్నీషియం ఎముకలకు బలాన్ని అందిస్తాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. బోలు ఎముకల వ్యాధులను నివారిస్తాయి. ఎముకల ఆరోగ్యానికి ఈ ఖనిజాలు చాలా ముఖ్యమైనవి. ప్రతి రోజు బాదం తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అంతే కాకుండా ఫుల్ ఎనర్జీతో ఉంటారు.
జీర్ణ వ్యవస్థకు మేలు:
బాదంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది మలబద్దకంతో పాటు, అజీర్ణం, జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా బాదంలో అదనంగా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి.
మెదడుకు మేలు చేస్తుంది:
బాదంలో విటమిన్ ఇ తో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అంతే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఇవి మెదడు పనితీరును పెంచడంలో సహాయపడతాయి . అంతే కాకుండా అల్జీమర్స్, డిమెన్షియా వంటి వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Also Read: ఇలా చేస్తే.. గార పట్టిన పళ్లు క్షణాల్లోనే.. తెల్లగా మెరిసిపోతాయ్
చర్మానికి మేలు:
బాదంలో ఉండే విటమిన్ ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ,మెరిసేలా చేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది . అంతే కాకుండా అకాల వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. బాదంపప్పులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుండి చర్మాన్ని రక్షిస్తాయి. ఫలితంగా చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.