BigTV English

Food for Diabetics: మీ ఒంట్లో ‘చక్కెర’ ఉందా? అయితే.. చలికాలంలో ఈ ఫుడ్ తింటే బెటర్, లేకపోతే…

Food for Diabetics: మీ ఒంట్లో ‘చక్కెర’ ఉందా? అయితే.. చలికాలంలో ఈ ఫుడ్ తింటే బెటర్, లేకపోతే…

శీతాకాలంలో ఏ ఆహారం తిన్నా మధుమేహులకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. చల్లని వాతావరణంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టంగా మారుతుంది. దీనివల్ల వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలి.


మధుమేహం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఈ పరిస్థితిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. వాతావరణంలోని మార్పులు హార్మోన్లలో కూడా మార్పులకు కారణం అవుతాయి. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు పెరిగిపోతాయి.

మధుమేహం ఉన్నవారు రాత్రిపూట సరైన ఆహారాలను తీసుకోవాలి. లేకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి చలికాలంలో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలను తెలుసుకొని వాటిని తినడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సున్నా నుండి 100 వరకు ఉన్న స్కేల్ తో గ్లైసెమిక్ ఇండెక్స్ కొలుస్తారు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత తక్కువ ఉంటే ఆ ఆహారం అంత  ఆరోగ్యకరమైనదని అర్థం.


గుమ్మడి గింజలు
గుమ్మడికాయ గింజలు గుప్పెడు ప్రతిరోజు తినేందుకు ప్రయత్నించండి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కూడా నిండుగా ఉంటాయి.

బెండకాయ
భారతదేశంలో దీన్ని భిండీ, లేడీస్ ఫింగర్ అని పిలుస్తారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కర ను తగ్గించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.

అవిసె గింజలు
అవిసె గింజలు మధుమేహులకే కాదు, సాధారణ వ్యక్తులు కూడా ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇవి మిమ్మల్ని శీతాకాలంలో వెచ్చగా ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అధ్యయనాల ప్రకారం టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు అవిసె గింజలను తింటే చక్కెర నియంత్రణలో ఉన్నట్టు తెలిసింది. అలాగే HBA1c లో గణనీయమైన తగ్గుదల కనబడింది.

ఓట్స్
ప్రపంచవ్యాప్తంగా ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ లలో ఓట్స్ మీల్ కూడా ఒకటి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. దీనిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కర స్థాయిలు తగ్గుతాయి. శీతాకాలంలో బరువు పెరగకుండా కాపాడుకోవడంలో కూడా ఓట్స్ ముందుంటాయి.

బెర్రీలు
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు… ఇవన్నీ కూడా బెర్రీ జాతి పండ్లే. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. రక్తంలో చక్కెరను నిర్వహించడం కూడా సులువుగా మారుతుంది. అధిక కార్బోహైడ్రేట్స్ ఉంటే భోజనంతో పాటు బెర్రీలు తీసుకోవడం వల్ల అందులో ఉండే కార్బోహైడ్రేట్స్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది.

Also Read: ముందు రోజు రాత్రి స్వీట్లు అధికంగా తిన్నారా? స్వీట్ హ్యాంగోవర్ నుంచి ఇలా తప్పించుకోండి

కోడిగుడ్లు
గుడ్లలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. అధిక బరువు, ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుంది.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×