My Home Apartment: హైదరాబాద్ లోని కోకాపేట్ నియోపోలీస్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం నియోపోలీస్ లో గల మై హోమ్ అపార్ట్మెంట్ నుండి పొగలు రావడాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు చూస్తుండగానే మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురై అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందజేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం మంటలను అదుపు చేస్తున్నారు.
నియోపోలీస్ లో ఏడు టవర్లతో మై హోమ్ నిషాద నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ భారీ స్థాయిలో అపార్ట్మెంట్లను మై హోమ్ సంస్థ నిర్మిస్తోంది. ఒక ఫ్లాట్ లో మంటలు వ్యాపించి దట్టంగా పొగలు బయటికి రావడంతో స్థానికులు, మై హోమ్ సిబ్బందికి సమాచారం అందజేశారు. అంతలోనే ఒక ఫ్లాట్ నుండి మరో ఫ్లాట్ కు మంటలు వ్యాపించాయి.
Also Read: Sridhar Babu: ఎమ్మేల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు
మంటల ధాటికి ఆకాశాన్ని తాకేలా పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మై హోమ్ అపార్ట్మెంట్స్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. భారీ ఫైర్ ఇంజన్లతో ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది.