Washington Sundar: క్రికెట్ మ్యాచ్ లలో మనం తరచూ వివాదాలు చూస్తూనే ఉంటాం. అంపైర్ల నిర్ణయాల పైన లేదా ఆటగాళ్ల తీరుపై విమర్శలు వస్తూనే ఉంటాయి. అంపైర్లు వైడ్ బాల్ ని రైట్ బాల్ గా ఇవ్వడం, అవుట్ ని నాట్ అవుట్ గా ప్రకటించడం, నో బాల్స్ విషయంలో జరిగే తప్పిదాలు మ్యాచ్ పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్నిసార్లు జట్టు విజయపజయాలను కూడా డిసైడ్ చేస్తాయి. ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నో చూసాం.
Also Read: Jasprit – Sam Konstas: ఓవరాక్షన్ చేసిన ఆస్ట్రేలియా… తోక కత్తిరించిన బుమ్రా!
మ్యాచ్ పూర్తి అయ్యాక విజేతను ప్రకటించిన తర్వాత ఇలాంటి వివాదాలు తెరపైకి వస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అంపైర్ నిర్ణయం మరోసారి కాంట్రవర్సీకి దారితీసింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ లో అంపైర్ల నిర్ణయాలపై భారత జట్టు కెప్టెన్ బూమ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా థర్డ్ అంపైర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని బూమ్రా అసహనం వ్యక్తం చేశాడు. థర్డ్ ఎంపైర్ గత మ్యాచ్ లో ఒక విధంగా, ఈ మ్యాచ్ లో మరో విధంగా వ్యవహరించారంటూ నెటిజెన్లు కూడా మండిపడుతున్నారు.
సిడ్నీ వేదికగా శుక్రవారం ఉదయం ప్రారంభమైన మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్ కి దిగిన భారత టాప్ బ్యాటర్లు నిరాశపరిచారు. ఈ క్రమంలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కొంతసేపు పీచ్ పై నిలిచి 30 బంతులలో 14 పరుగులు చేశాడు. అయితే 66వ ఓవర్ చివరి బంతికి ఆసీస్ కెప్టెన్ పాట్ కమీన్స్ వేసిన బంతిని పుల్ ఆడేందుకు ప్రయత్నించాడు సుందర్. కానీ ఆ బంతి బ్యాట్ కి దగ్గరగా వెళ్ళింది.
అయితే ఆ బంతి బ్యాట్ ని తాగకుండానే కీపర్ చేతిలో పడింది. ఈ సందర్భంలో ఆసిస్ ప్లేయర్లు అప్పీల్ చేశారు. కానీ ఫీల్డ్ అంపైర్ దానిని నాట్ అవుట్ గా ప్రకటించడంతో ఆస్ట్రేలియా రివ్యూ కోరింది. థర్డ్ ఎంపైర్లు పలు యాంగిల్స్ లో బంతిని పరిశీలించారు. ఆ బాల్ సుందర్ గ్లౌవ్ ని తాకిన విధంగా ఓ యాంగిల్ లో.. మరో యాంగిల్ లో తాకనట్లుగా స్నికో మీటర్ స్పైక్ వచ్చింది. దీంతో అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించాడు.
Also Read: Champions Trophy 2025: రోహిత్ కు దెబ్బ మీద దెబ్బ.. వన్డే కెప్టెన్సీ కూడా గల్లంతు !
అదే సమయంలో నాన్ – స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బూమ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత మ్యాచ్ లో ఒక విధంగా.. ఈ మ్యాచ్ లో మరో విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నాడు బుమ్రా. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి. మెల్ బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కూడా జైశ్వాల్ ఔట్ ఇదేవిధంగా వివాదాస్పదం అయింది. ఇప్పుడు మరోసారి వివాదాస్పద నిర్ణయంతో భారత బ్యాట్స్మెన్ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆసిస్ అంపైర్లతో ఫిక్సింగ్ కి పాల్పడుతుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
JASPRIT BUMRAH IS NOT HAPPY WITH WASHINGTON SUNDAR DECISION:
– Bumrah saying “Last game he didn’t give it out on snicko and now this give out”.pic.twitter.com/TNl69lFcY5
— Tanuj Singh (@ImTanujSingh) January 3, 2025