Pigmentation: చర్మ సమస్యలు ప్రస్తుతం సాధారణంగా మారాయి. కొంత మంది ముఖం మీద నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ముక్కు,బుగ్గలు, నుదిటిపై కూడా కనిపిస్తాయి. ఈ మచ్చలు ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. మార్కెట్‌లో దొరికే క్రీములు వీటిని తగ్గిస్తాయి. కానీ అవి చర్మానికి హాని కలిగిస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు కొన్ని రకాల హోం రెమెడీస్ పాటించి నల్ల మచ్చలను తగ్గించుకోవాలి. పిగ్మెంటేషన్ తగ్గించేందుకు హోం రెమెడీస్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పిగ్మెంటేషన్‌ను తొలగించడానికి సులభమైన రెమెడీస్:
ముఖంపై ఉండే చిన్న చిన్న మచ్చలను తొలగించడానికి ఈ రెమెడీలను ప్రయత్నించండి. వీటిని వాడటం వల్ల ప్రభావం ఒక వారంలోనే కనిపిస్తుంది. మచ్చల సమస్య సర్వసాధారణమైన చర్మ సమస్య అయినప్పటికీ, ఈ సమస్య స్త్రీల అందాన్ని పాడు చేస్తుంది. వీటిని ఎదుర్కోవడానికి ఇంట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయి.
జాజికాయ:
జాజికాయ ముఖంపై ఉన్న మచ్చలను తగ్గించడానికి ఉపయోగించవచ్చు. ఇందుకోసం ముందుగా అర గ్లాసు పాలను తీసుకుని అందులో ఒక జాజికాయను 5 నిమిషాల పాటు వేసి మరిగించాలి. తర్వాత జాజికాయను విడిగా తీసి నూరాలి. జాజికాయను గ్రైండ్ చేస్తున్నప్పుడు, అందులో ఉడికించిన పాలను అవసరాన్ని బట్టి కలపండి.ఇలా పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్‌ను మచ్చలపై అప్లై చేయండి. ఆరిన తర్వాత పూర్తిగా కడిగేయండి.
పసుపు, పాలు:
ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు ఆరోగ్యానికి అలాగే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.పసుపు శరీరం యొక్క అనేక అంతర్గత , బాహ్య సమస్యలను ఎదుర్కోవటానికి ఉపయోగిస్తారు. దీని సహాయంతో మీరు చిన్న చిన్న మచ్చలను కూడా వదిలించుకోవచ్చు.పసుపు, పాలు కలిపి, మందపాటి పేస్ట్ సిద్ధం చేయండి. ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్‌ను మచ్చలలపై అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని కడగాలి.
Also Read: బియ్యం పిండితో ఫేస్ ప్యాక్.. క్షణాల్లోనే నిగనిగలాడే చర్మం
సన్‌స్క్రీన్ అప్లై చేయడంపై శ్రద్ధ వహించండి:
చిట్కాలను అనుసరించడంతో పాటు, చిన్న చిన్న మచ్చలను ఎదుర్కోవటానికి సరైన సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. UV కిరణాల నుండి ముఖాన్ని రక్షించుకోవడానికి, అధిక SPF రేటింగ్ ఉన్న సన్‌స్క్రీన్‌ని ఎంచుకుని సరిగ్గా ముఖానికి అప్లై చేయండి. ఎండగా ఉన్నా లేకపోయినా ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఎప్పుడూ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి.