Tirumala Laddu Counter: తిరుమలో ఇటీవల తరుచుగా ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. వారం క్రితం తిరుమలలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందని విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన మరవకముందే తిరుమల లడ్డూ కౌంటర్ వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది.
లడ్డూ కౌంటర్లో ఒక్కసారి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడ క్యూలైన్‌లో నిలుచున్న భక్తులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. కంప్యూటర్ యూపీఎస్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగనట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.
Also Read: Chamala Kiran: అందుకే ఆప్‌కు అ పరిస్థితి వచ్చింది.. ఢిల్లీ సీఎం వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ చామల
తరుచుగా తిరుమలలో జరుగుతన్న ప్రమాదాలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ సిబ్బంది భక్తులకు సరైన వసతులన్నీ ఏర్పాటు చేయాలని.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.