BigTV English

Maha Kumbh Mela: మహా కుంభమేళాకు రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు, భక్తుల కోసం ఏకంగా 13 వేల రైళ్లు కేటాయింపు!

Maha Kumbh Mela:  మహా కుంభమేళాకు రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు, భక్తుల కోసం ఏకంగా 13 వేల రైళ్లు కేటాయింపు!

Maha Kumbh- Indian Railways: 12 ఏండ్లకు ఓసారి అంగరంగ వైభవంగా జరిగే మహా కుంభమేళా ఆధ్యాత్మిక వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రయాగరాజ్‌ లో ఇవాళ (జనవరి 13) పుష్య పౌర్ణమి స్నానంతో మొదలైంది. గతంతో పోల్చితే ఈసారి మహా కుంభమేళా వేడుకు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. 144 సంవత్సరాల తర్వాత ఈ మహా కుంభమేళా వేడుక జరుగుతున్నది. మామూలుగా ప్రతి 6 ఏడ్లకు ఓసారి అర్ధ కుంభమేళాను నిర్వహిస్తారు. 12 సంవత్సరాల కోసారి కుంభమేళా జరుగుతుంది. కానీ, ఈసారి అరుదైన మహా కుంభమేళా జరుగుతున్నట్లు ఆధ్యాత్మిక వేత్తలు తెలిపారు.


ఈ మహా కుంభమేళాకు మరో ప్రత్యేకత

ఇక ఈసారి జరిగే మహా కుంభమేళా ఎంతో ప్రత్యేమైనదని పండితులు చెప్తున్నారు. నిజానికి కుంభమేళా అనేది  ప్రయాగరాజ్‌, హరిద్వార్‌, ఉజ్జయిని, నాసిక్‌ లో జరుగుతుంది. కానీ, మహా కుంభమేళా కేవలం ప్రయాగరాజ్‌ లోనే జరుగుతుంది. సుమారు 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకు సుమారు 40 కోట్ల మంది హాజరవుతారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తున్నది. దేశం వ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి ఈ వేడుకకు భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంటుంది.


Read Also: మహా కుంభమేళా కోసం స్పెషల్ సాంగ్.. ఆవిష్కరించిన రైల్వే సంస్థ!

మహా కుంభమేళాకు భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు

ప్రతిష్టాత్మక కుంభమేళా వేడుక కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు తరలివచ్చే భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. గత కొద్ది నెలలుగా ఈ మహాక్రతువు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే ఆధ్వర్యంలో 24 గంటల వార్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ప్రయాగరాజ్ తో పాటు సమీపంలోని అన్ని రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదనపు టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

Read Also: సంక్రాంతి వేళ ప్రయాణీకులకు గుడ్ న్యూస్, మరో వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ కోచ్‌ లు పెంపు!

మహా కుంభమేళా కోసం 13 వేల రైళ్లు

ప్రయాగరాజ్ లో జరిగే మహా కుంభమేళా వేడుకల కోసం 13 వేల రైళ్లను షెడ్యూల్ చేసింది భారతీయ రైల్వే సంస్థ. వీటిలో 10 వేల సాధారణ రైళ్లతో పాటు 3,134 ప్రత్యేక రైళ్లు ఉన్నట్లు వెల్లడించింది. గత కుంభమేళాతో పోల్చితే ఈసారి సుమారు 5 రెట్లు ఎక్కువగా రైళ్లు నడుపుతున్టన్లు తెలిపారు. తక్కువ దూరం కోసం 1,896 రైళ్లు, దూర ప్రాంతాలకు  706, మరో 559 రింగ్‌ ట్రైన్స్‌ నడిపిస్తున్టన్లు ప్రకటించింది. ఈ రైళ్లకు ముందు, వెనుక ఇంజినట్లు ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. కుంభమేళాకు వచ్చే భక్తులకు అర్థం అయ్యేలా సుమారు 15 ప్రాంతీయ భాషల్లో రైల్వే అనౌన్స్ మెంట్స్ ఇప్పిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కుంభమేళాకు తరలి వచ్చే భక్తుల కోసం రైల్వే ఆధ్వర్యంలో ప్రత్యేక వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

Read Also: మహా కుంభమేళాకు వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలంటే?

Related News

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Big Stories

×