BigTV English

Egg 65 Recipe: ఎగ్ 65 రెసిపీ, రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది

Egg 65 Recipe: ఎగ్ 65 రెసిపీ, రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది

చికెన్ 65, గోబీ 65 లాగే ఎగ్ 65 చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సరికొత్తగా రెస్టారెంట్లలో చేరిన వంటకం ఇది. 65రెసిపీ చెన్నైలో పుట్టిందని చెప్పుకుంటారు. అక్కడి నుంచి అన్ని నగరాలకు చేరిందని అంటారు. దీన్ని భారతదేశం అంతా ఇష్టంగా తింటారు. అయితే ఒక్కో ప్రాంతంలో దీన్ని ఒక్కో తీరుగా చేస్తారు. ఎలా చేసినా రుచిగానే ఉంటుంది. ఇప్పుడు పెళ్లిళ్లలో కూడా  ఎగ్ 65ను వడ్డించడం మొదలుపెట్టారు. దీన్ని ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు. బయట తినే కన్నా ఇంట్లోనే దీన్ని వండుకొని చూడండి… మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది.


ఎగ్ 65 రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు – నాలుగు
మైదా పిండి – మూడు స్పూన్లు
కార్న్ ఫ్లోర్ – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
గరం మసాలా – ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – అర స్పూను
కారం – ఒక స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
జీలకర్ర పొడి – ఒక స్పూను
నీళ్లు – తగినన్ని
నూనె – తగినంత
ఉల్లిపాయ తరుగు – రెండు స్పూన్లు
వెల్లుల్లి తరుగు – ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
ఎండుమిర్చి – రెండు
పచ్చిమిర్చి – రెండు
ఉప్పు – రుచికి సరిపడా
పెరుగు – ఒక కప్పు
రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
నిమ్మరసం – అర స్పూను

ఎగ్ 65 రెసిపీ
1. కోడిగుడ్లను ముందే ఉడికించుకొని పొట్టు తీసి నిలువుగా నాలుగు ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో ఉప్పు, మైదాపిండి, కార్న్ ఫ్లోర్, అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, అర స్పూన్ గరంమసాలా, కొద్దిగా నీళ్లు వేసి గిలక్కొట్టుకోవాలి.
3. అందులోనే కోడిగుడ్లను వేసి మ్యారినేట్ చేయాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
5. ఆ నూనె వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్న ఎగ్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.
7. అందులో వెల్లుల్లి తరుగును, పచ్చిమిర్చి తరుగును వేసి వేయించాలి.
8. తర్వాత ఉల్లిపాయ తరుగు, ఎండుమిర్చి తరుగు, ఉప్పు, కారం, కరివేపాకులు, అర స్పూన్ గరం మసాలా, అర స్పూను కారం, అర స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేయించుకోవాలి.
9. అందులోనే పెరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
10. ఆ పెరుగు ఉడుకుతున్నప్పుడే రెడ్ ఫుడ్ కలర్ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
11. పెరుగు దగ్గరగా చిక్కగా అవుతుంది. ఆ సమయంలో ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను వేసి కలుపుకోవాలి.
12. పైన కొత్తిమీర తరుగును చల్లి నిమ్మరసాన్ని పిండుకోవాలి.
13. ఇది పొడిపొడిగా అయ్యేవరకు చిన్న మంట మీద వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
14. అంతే టేస్టీ ఎగ్ 65 రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడిగా తింటే రుచి అదిరిపోతుంది.


Also Read: పనీర్‌తో ఇలా గులాబ్ జామున్ చేసేయండి, రుచి కొత్తగా అదిరిపోయేలా ఉంటుంది

కోడిగుడ్లతో చేసే వంటకాలు ఏవైనా చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి అభిమానులు కూడా ఎక్కువే. నాన్ వెజ్ ప్రియులకు కోడిగుడ్డు ఒక వరమనే చెప్పాలి. ఒక్కసారి మీరు ఈ ఎగ్ 65 రెసిపి చేసుకొని చూడండి. ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు వడ్డించండి. కచ్చితంగా వారి ప్రశంసలు మీరు పొందుతారు.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×