Big Stories

Smartphone Pinky : బీ కేర్ ఫుల్.. స్మార్ట్‌ఫోన్ పింకీ వస్తోంది!

smartphone pinky
smartphone pinky

Smartphone Pinky : స్మార్ట్‌ఫోన్‌ల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను చాలామంది అతిగా వాడేస్తున్నారు. రోజులో ఎక్కువ సేపు ఫోన్‌తోనే గడిపేస్తున్నారు. 6 గంటలకు మంచి స్మార్ట్‌ఫోన్‌ యూజ్ చేయకూడదు. మీలో ఎవరైనా అలాంటి వాళ్లు ఉంటే బీ కేర్ ఫుల్‌గా ఉండాలి. లేదంటే స్మార్ట్​ఫోన్​ పింకీ వస్తోంది. స్మార్ట్ ఫోన్ పింకీ అనేది ఒక వ్యాధి. పింకీ ఫింగర్ అంటే.. చిటికెన వేలు. స్మార్ట్ ఫోన్ అతిగా వాడటం వల్ల మన చేయి చిటికెన వేలు స్వరూపం మారిపోతుంది. ఐఫోన్ వాడే వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ అదంతా దుష్ప్రచారం అని యాపిల్ ఖండించింది. స్మార్ట్​ఫోన్​ పింకీ గురించి మరిన్నీ వివరాలు తెలుసుకోండి.

- Advertisement -

స్మార్ట్‌ఫోన్ వినియోగించేటప్పుడు పింకీ ఫింగర్ వెనుకు నుంచి సపోర్ట్‌గా ఉంటుంది. ఇలా ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల వేలు మనకు తెలియకుండానే వంగిపోతుంది. దీనివల్ల వేలు నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఫోన్ భారం వేలుపై పడటం వల్ల శాశ్వతంగా వంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఫోన్‌ను ఎక్కువగా వాడొద్దు. చాటింగ్ చేసే సమయంలో 90 డిగ్రీలకు మించి చేతిని వంచి ఉంచితే స్మార్ట్ ‌ఫోన్ ఎల్బో అనే మరో సమస్య తలెత్తుతుంది. దీనివల్ల కూడా చిటికెను వేలు దెబ్బతింటుంది. స్మార్ట్‌ఫోన్ పింకీ వల్ల చిటికెన వేలులో జలదరింపు, తిమ్మిరి వంటివి ఫీల్ అవుతారు. ఇది క్రమంగా ఉంటే నరాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా చేతి వేల్లు వంగిపోతాయి.

- Advertisement -

Also Read : మందులో నీళ్లు కలపాలా.. సోడా కలపాలా మామ?

స్మార్ట్‌ఫోన్‌ను వాడే క్రమంలో బొటనవేలు, మెడ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజంగా బొటనవేలుతో టెక్స్ట్, స్వైప్​ తరచూ చేస్తుంటే కీళ్ల సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలానే మెడ విషయానికొస్తే.. సాధారణంగా ప్రతి ఒక్కరి తల బరువు 4 నుంచి 5 కిలోల వరకు ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగించేటప్పుడు తలను వేలాడదీసి కిందికి చూస్తుంటాం. దీనివల్ల మెడ కండరాలపై భారం పడి దెబ్బతింటాయి. అంతేకాకుండా కండరాల నొప్పులు పెరుగిపోతాయి. కాబట్టి స్మార్ట్‌ఫోన్‌ను అతిగా ఉపయోగించకండి. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News