Big Stories

Soda or Water..?: అరె మావ.. సోడా.. వాటర్.. మందులోకి ఏది బెటరంటావ్..?

Health Tips

- Advertisement -

Soda or Water..? Which one is Good for Alcohol: మద్యం ఆరోగ్యానికి హానికరం. మద్యం తాగితే పోతారు. ఇది మనందరికీ తెలిసిందే. మద్యం బాటిళ్లపై ఇదే రాసుంటారు. ఏ సినిమాకి వెళ్లినా మన హీరో ఇదే మాట చెప్తాడు. ఇక మద్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీకెండ్స్ వస్తే యువత మద్యం మత్తులో మునిగి తేలుతుంటారు. ఈ మద్య సిటీల్లో అమ్మాయిలు కూడా బీర్లు కొట్టెస్తున్నారు. బీర్లు, బీజర్లు, వొడ్కా, రమ్ము, జిన్ను, వైన్, విస్కీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో చాలా రకాలు ఉన్నాయి.

- Advertisement -

మద్యం ప్రియులు అందరూ కూడా మద్యం తాగాలంటే.. దానికి అడిషనల్‌గా సోడా, కూల్ డ్రింక్స్ లేదా నీళ్లు ఉండాలి. లేదంటే ఆల్కహాల్ పవర్‌ను తట్టుకోలేరు. కాబట్టి మద్యానికి వీటిని కాస్త జోడించి తీసుకుంటుంటారు. కానీ చాలా మందికి మద్యంలో వీటిని కలపడంపై కొన్ని అపోహలు ఉన్నాయి. అందుకే రా కొట్టేసి హ్యాంగోవర్ బారిన పడుతుంటారు. భరించలేని తలనొప్పితో హ్యాంగోవర్ పెగ్ వేస్తుంటారు. అయితే మద్యంలో నీళ్లు, సోడా, కూల్‌డ్రింక్స్ కలపొచ్చా? ఆరోగ్యానికి ఇందులో ఏది మంచిదో తెలుసుకుందాం..

Also Read: తల్లి నుంచి ఆడ పిల్లలకు అతి బరువు ముప్పు..

ఇక మందు తాగేందుకు పది మంది సిట్టింగ్ వేశారంటే.. కొందరు బీర్లు తాగుతారు. మరి కొందరు లిక్కర్‌ ఇష్టపడతారు. బీర్ తాగితే పొట్టవస్తుందని అది కాకుండా.. విస్కీ, రమ్, బ్రాండీ, వొడ్కా, బీజర్ వంటివి తీసుకుంటారు కొందరు. ఇందులో బీర్, బీజర్ నేరుగా తాగొచ్చు. ఇందులో నీళ్లు, డ్రింక్స్ కలపాల్సిన అవసరం లేదు. ఇక బ్రాంది, విస్కీ, రమ్ వంటివి తాగేవాళ్లు అందులో వాటర్ లేదా సోడా కలుపుకుంటారు. కొందరైతే ఈ రెండూ కూడా మిక్స్ చేస్తారు.

మందులో ఎక్కువ మంది సోడా కలుపుకుంటారు. మందులో సోడా కలపడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తారు. అంతేకాకుండా సోడా కలిపితే మత్తు కూడా త్వరగా రాదు. కొందరైతే ఎది కలపకుండానే తాగేస్తారు. మందులో ఏదైనా డ్రింక్స్ లేదా నీళ్లు, సోడా కలపడం వల్ల మందు టేస్ట్ మారుతుందని, కడుపులో గ్యాస్ పెరుగుతుందని మిక్స్ చేసేందుకు ఇష్టపడరు. మరికొందరు మిక్స్ చేసి తీసుకుంటారు.

Also Read: ఈ నీటితో తలస్నానం చేస్తే.. సిల్కీ మృదువైన పొడవాటి జుట్టు మీ సొంతం!

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మందులో సోడా లేదా నీళ్లను కలుపుకోవడం మంచిదే. అంతేకాకుండా సోడా కన్నా నీళ్లు మిక్స్ చేసి తాగితేనే బెటన్ అని చెబుతున్నారు. సోడా ఎక్కువగా తాగడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి. ఎసిడిటీ సమస్య కూడా తలెత్తుతుంది. ఇదంతా పక్కనపెడితే అసలు ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. దీనికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. మద్యం వల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News