Hair Fall Control Tips: అమ్మాయిలు , అబ్బాయిలు.. ఎవరైనా స్టైలిష్‌గా కనిపించడంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా, నల్లగా, మెరిసేలా ఉండాలని కోరుకుంటారు. కానీ మారుతున్న వాతావరణం, కాలుష్యం కారణంగా జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా కష్టమవుతోంది. ముఖ్యంగా పొడవాటి జుట్టు ఉన్నవారు తమ జుట్టు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఒక వేళ మీరు కూడా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతుంటే మాత్రం కొన్ని రకాల జాగ్రత్తలు అవసరం. ఇవి మీ జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఎక్కువగా జుట్టు రాలుతుంటే గనక మీరు డాక్టర్లను సంప్రదించడం ముఖ్యం. జుట్టు రాలకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
షాంపూ, కండిషనర్ :
మీ జుట్టు దెబ్బతినకూడదనుకుంటే మీ జుట్టు రకాన్ని బట్టి మాత్రమే షాంపూ , కండిషనర్‌ను ఎంచుకోండి. డ్యామేజ్ హెయిర్ ను పోషించడానికి మాయిశ్చరైజింగ్ షాంపూ, కండిషనర్ ఉపయోగించండి. మార్కెట్ లో కొత్త హెయిర్ షాంపూ వస్తే చాలు చాలా మంది కొని వాడుతూ ఉంటారు. ఇలా చేయడం సరైన పద్దతి కాదు. మన హెయిర్ రకాన్ని బట్టి , షాంపూ, కండీషనర్ వాడాలి. వీలైనంత వరకు నేచురల్ హెయిర్ కేర్ ప్రొడక్ట్ వాడటం మంచిది. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు అధిక రసాయనాలు ఉన్న షాంపూలను వాడినా కూడా అందులో ఉండే కెమికల్స్ మీ జుట్టును మరింత డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంటుంది.
హెయిర్ డ్రైయర్:
ప్రస్తుతం చాలా మంది కూడా తమ జుట్టును స్టైల్ చేయడానికి హెయిర్ డ్రైయర్ లను ఉపయోగిస్తున్నారు. వీటిని ఉపయోగించడం సరైన పద్దతి కాదు. మీరు మీ జుట్టుకు స్ట్రెయిట్నర్, కర్లర్ లేదా డ్రైయర్ వంటి వాటి నుండి కూడా రక్షించుకోవాలి. మీరు వీటిని ఉపయోగించాలనుకుంటే వేడి నుండి రక్షించే స్ప్రేని ఉపయోగించండం ముఖ్యం.
హెయిర్ మాస్క్, ఆయిల్ ముఖ్యం:
మీ జుట్టుకు సరైన పోషణ అవసరం. అందుకే వారానికి ఒకటి లేదా రెండుసార్లు హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందిజ అంతే కాకుండా మీ జుట్టుకు సరిగ్గా నూనె అప్లై చేయడం కూడ చాలా ముఖ్యం. కొబ్బరి నూనె, ఆర్గాన్ నూనె, ఆలివ్ నూనె లేదా బాదం నూనె జుట్టుకు పోషణనిచ్చి జుట్టు రాలే సమస్యను చాలా వరకు తగ్గిస్తాయి. కాబట్టి మీరు ఈ నూనెలను జుట్టుకు ఉపయోగించవచ్చు. అంతే కాకుండా కొన్ని రకాల హోం రెమెడీస్ సహాయంతో కూడా హెయిర్ మాస్క్ లను ఈజీగా తయారు చేసుకుని వాడవచ్చు.
Also Read: విపరీతంగా జుట్టు రాలుతోందా ? ఈ టిప్స్ మీ కోసమే !
చల్లటి నీరు:
చాలా మంది హెయిర్ వాష్ కోసం వేడి నీటిని ఉపయోగస్తుంటారు. వేడి నీరు జుట్టుకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. అంతే కాకుండా జుట్టును చల్లటి నీటితో వాష్ చేయడం వల్ల దాని తేమను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. వేడి నీరు వాడటం వల్ల జట్టు డ్రై గా మారి చాలా వరకు దెబ్బతింటుంది. అందుకే పొరపాటున కూడా జుట్టును వేడి నీటితో వాష్ చేయకూడదు.
హెయిర్ కలర్స్:
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ జుట్టుకు రంగు వేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇది జుట్టుకు చాలా నష్టం కలిగిస్తుంది. హెయిర్ డై లేదా ఇతర రసాయన ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించండి. ఇలా చేయడం వల్ల మీరు మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంతే కాకుండా జుట్టు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.