Drumsticks: మునగ అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఆయుర్వేదం ప్రకారం ఈ చెట్టులోని అన్ని భాగాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆకులు, కాయలు, వేర్లతో పాటు బెరడు కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. చాలా మంది మునగకాయలను మాత్రమే తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కానీ కాయలతో పాటు మునగ ఆకులు కూడా అనేక ఆరోగ్య సమస్యలు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి.
ఇదిలా ఉంటే మునగ కాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఖనిజాలు, విటమిన్లు కూడా ఉంటాయి. వీటిలో A, C, K B విటమిన్లతో పాటు ఐరన్, కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా అధిక మొత్తంలో ఉంటాయి. వీటిలోని పోషకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. మరి మునగకాయలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మునగ కాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో పోషకాల సంపద దాగి ఉంది. అందుకే మునగను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. మునగ యొక్క ప్రత్యేక లక్షణాల కారణంగా ఆయుర్వేదంలో మునగకాయ చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మునగ ఆకులు, పండ్లు, గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.మునగ కాయలు ఎముకలకు చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో కూడా మునగ కాయలు చాలా మేలు చేస్తాయి.
మునగకాయ తినడం వల్ల కలిగే 7 అద్భుతమైన ప్రయోజనాలు:
పోషకాల నిధి:
మునగకాయ పోషకాల నిధి. విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, సి, ఇలతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి.
రోగనిరోధక శక్తి:
డ్రమ్‌స్టిక్‌లో యాంటీఆక్సిడెంట్ , యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతే కాకుండా ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి .
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
మునగలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇవి మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
ఎముకలను బలపరుస్తుంది:
మునగలో పుష్కలంగా కాల్షియంతో పాటు ఫాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది:
మునగలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
Also Read: కొరియన్ అమ్మాయిల సిల్కీ, షైనీ హెయిర్ సీక్రెట్ ఇదే !
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది:
మునగకాయలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. దీని వలన మళ్లీ మళ్లీ తినాలనే కోరిక కూడా ఉండదు. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది: మునగలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మెరుస్తూ ఉంటుంది. ఇది జుట్టును బలంగా మార్చడంతో పాటు మృదువుగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.