BigTV English

Boiled Peanuts: ఉడికించిన వేరుశెనగతో బోలెడు లాభాలు

Boiled Peanuts: ఉడికించిన వేరుశెనగతో బోలెడు లాభాలు

Boiled Peanuts Benefits: వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఏదో ఒకటి వేయించుకుని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. లేదంటే ఉడకబెట్టుకుని తింటూ ఉంటారు. కేవలం టెస్ట్ కోసం.. స్నాక్స్ తినడం మాత్రమే కాదు.హెల్లీ ఫుడ్ కూడా వర్షాకాలంలో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేరుశనగలు ఉడికించి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ఉడకబెట్టిన పల్లీలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాలు:
ఉడికించిన వేరుశనగల్లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ తో పాటు వివిధ రకాల ఖనిజాలు, విటమిన్లు, సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు:
మోనో సాచురేటెడ్, పాలీ అన్ సాచురేటెడ్ కొవ్వులు వేరుశనగలో ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా వీటిని మితంగా తీసుకోవడం పలు రకాల వ్యాధుల బారి నుంచి బయట పడవచ్చు.
యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు:
ఉడికించిన పల్లీల్లో రెస్వెరాట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను నియంత్రణలో ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపు సమస్యలను తగ్గించడానికి యాంటీ ఈ ఆక్సిడెంట్ లక్షణాలు సహాయపడతాయి.
బరువు విషయంలో:
వేరుశెనగలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ వీటిలో ఉండే అధిక ప్రోటీ,న్ ఫైబర్ కంటెంట్ కడుపుకు సంతృప్తినిచ్చి అధిక ఆకలిని అడ్డుకుంటాయి. రోజు తినే ఆహారంలో వీటిని చేర్చుకుంటే సమతుల్య ఆహారం తీసుకొని బరువు పెరగకుండా ఉంటారు.
రక్తంలో చక్కెర నియంత్రణ:
వేరు శనగలో ఉండే ఫైబర్ కంటెంట్ చెక్కర శోషణను తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా షుగర్‌తో బాధపడుతున్న వారు పల్లీలను తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.


Also Read: వర్షం నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

మెదడు ఆరోగ్యం:
మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఫోలేట్, నియాసిన్ వంటి పోషకాలు ఉడికించిన వేరుశెనగలో అధికంగా ఉంటాయి. ఇవి నాడీవ్యవస్థను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.


Related News

Stress: క్షణాల్లోనే.. స్ట్రెస్ తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Vitamin K Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Big Stories

×