BigTV English

Walking Benefits: రోజు 30 నిమిషాలు నడిస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

Walking Benefits: రోజు 30 నిమిషాలు నడిస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

Walking Benefits: ఫిట్‌గా ఉండాలంటే జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టాల్సిన అవసరం లేదని మీకు తెలుసా? అవును ప్రతిరోజు 30 నిమిషాలు నడవడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నడక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా అనేక రకాల సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. రోజు 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


నడక ప్రయోజనాలు:
రోజు కేవలం 30 నిమిషాల నడక మీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా? నేటి బిజీ లైఫ్‌లో, మన ఆరోగ్యం తరచుగా పాడవుతూ ఉంటుంది. కానీ, రెగ్యులర్ వాకింగ్ ఈ సమస్యకు సులభమైన, సమర్థవంతమైన పరిష్కారం. రోజు 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

గుండె ఆరోగ్యానికి వరం:
రోజు 30 నిమిషాల నడక గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటుతో పాటు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె కండరాలను బలపరుస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి రోజు 30 నిమిషాల పాటు తప్పకుండా నడవాలి.


బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది:
రెగ్యులర్ వాకింగ్ కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది జీవక్రియను పెంచుతుంది. ఇది శరీరంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా పొట్ట యొక్క కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తరుచుగా వాకింగ్ చేయడం అలవాటుగా చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా త్వరగా బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.

మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
టైప్-2 డయాబెటిస్‌ను నివారించడానికి.. ప్రతిరోజు 30 నిమిషాలు వాకింగ్ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ పేషెంట్లు వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది.

ఎముకలు, కండరాలను బలపరుస్తుంది:
నడక ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. తద్వారా బోలు ఎముకల వ్యాధి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలను నివారిస్తుంది . ఎముకల సంబంధిత సమస్యతో ఇబ్బంది పడే వారు వాకింగ్ చేయడం మంచిది.

ఒత్తిడిని తగ్గిస్తుంది:
నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది:

క్రమం తప్పకుండా నడవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
వాకింగ్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

Also Read: చలికాలంలో తక్కువగా నీరు త్రాగుతున్నారా ? జాగ్రత్త

సమయానికి శ్రద్ధ వహించండి- వాయు కాలుష్యం పెరగడం వల్ల ఉదయం లేదా సాయంత్రం ఎక్కువగా నడవడం హానికరం. కాబట్టి 8-9 గంటల తర్వాత నడవడం మంచిది.

వైద్యుల సలహా- మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, నడక ప్రారంభించే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

సౌకర్యవంతమైన బట్టలు- సౌకర్యవంతమైన బట్టలు , బూట్లు ధరించండి. తద్వారా మీరు ఎక్కువ సేపు నడవడానికి అవకాశం ఉంటుంది.

నీరు త్రాగుతూ ఉండండి- నడుస్తున్నప్పుడు నీరు త్రాగుతూ ఉండండి. తద్వారా శరీరంలో నీటి కొరత ఉండదు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×