Big Stories

Fridge Water: ఎండలో తిరిగి వచ్చి ఫ్రిడ్జ్ నీళ్లు తాగుతున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే

Fridge Water
Fridge Water

Fridge Water: మార్చిలోనే ఎండలు విపరీతంగా దంచికొడుతున్నాయి. దీంతో ఎండలో పడి తిరిగి వచ్చి చల్లచల్లగా జ్యూసులు, నీళ్లు తాగి కాస్త సేద తీరాలని అనుకుంటారు. అయితే ఇలా ఎండలో తిరిగి వచ్చి చల్లటి నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఎండలో తిరగడం వల్ల బాడీ అంతా వేడెక్కి పోతుందని.. ఈ తరుణంలో ఇంటికి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్రిడ్జ్ నీళ్లు తాగడం మూలంగా హార్ట్ ఎటాక్ వంటి గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఎండలో వేడిని చల్ల బర్చుకోడానికి చాలా మార్గాలు ఉంటాయని.. కానీ దాని కోసం చల్లటి నీటిని ఇలా తిరిగి వచ్చిన వెంటనే తాగడం మాత్రం ముప్పే అని పేర్కొన్నారు.

- Advertisement -

Also Read: తెల్ల ఉల్లిపాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. గుండె జబ్బులకు చెక్..

- Advertisement -

ఎండలో తిరిగి వచ్చాకే కాదు.. ఎండలోకి వెళ్లే సమయంలోను చల్లటి నీరు తాగడం ఆరోగ్యనికి మంచిది కాదు. ఎందుకంటే చల్లటి నీరును తాగి.. వేడి ఎండలో తిరగడం వల్ల రెండింటిని మన శరీరం బ్యాలెన్స్ చేయలేకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల వడదెబ్బ వంటి సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. మరోవైపు చల్లటి నీరును తాగడం వల్ల ఎండాకాలంలోను గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఎండలో వెళ్లేటప్పుడు ఫ్రిడ్జిలోని చల్లటి నీటిని ప్లాస్టిక్ బాటిళ్లలో నింపుకుని వెంట తీసుకెళ్తుంటారు. దీంతో ఎండ వేడికి ప్లాస్టిక్ కరిగి.. నీళ్లలో కలిసే ఛాన్స్ ఉంటుంది. దీని వల్ల శరీరంలోకి రసాయనాలు చేరి దాని వల్ల పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే వీలైనంత వరకు ఫ్రిడ్జి నీటిని కాకుండా మట్టి పాత్రలో ఉండే నీటిని తాగడం మంచిది. కుండలు, రంజాన్లు వంటి మట్టితో చేసిన పాత్రల్లోని నీటిని తాగడం వల్ల ఎండలో వేడెక్కిన శరీరాన్ని నెమ్మదిగా చల్లబరుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో మట్టి కుండలు ఎక్కడ బడితే అక్కడ అమ్ముతూనే ఉన్నారు. మంటి కుండల్లో నీటిని నింపుకుని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.

Also Read: మీరు బరువు ఎందుకు పెరుగుతున్నారో తెలుసా? ఈ తప్పులు చేస్తున్నట్లే మరి

చల్లటి నీటిని తరచూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయి. మలబద్ధకం, గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. అంతేకాదు చల్లటి నీటిని తాగడం వల్ల క్రమక్రమంగా శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అంతేకాదు వాగస్ నరాలపై ప్రభావం చూపించి గుండె సమస్యలకు దారి తీస్తుంది. చల్లటి నీరును ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు కూడా పాడవుతాయి. ఎండలో వెళ్లే సమయంలో చల్లటి నీటిని తీసుకుంటే మెదడు పనితీరు పాడవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News