BigTV English

Hibiscus Tea: ఈ టీ త్రాగితే.. వ్యాధులన్నీ పరార్ !

Hibiscus Tea: ఈ టీ త్రాగితే.. వ్యాధులన్నీ పరార్ !

Hibiscus Tea: మందార పూలు అనేక రకాలుగా ఉపయోగిస్తుంటారు. వీటితో అనేక ప్రయోజనాలు ఉంటాయి. మందార పూలలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మందార పూలుతో పాటు విత్తనాలు శతాబ్దాలుగా ఔషధాలను తయారు చేయడానికి లేదా ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించబడుతున్నాయని మీకు తెలుసా ?మందార పూలతో తయారు చేసిన టీ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. మరి మందార పూలతో తయారు చేసిన టీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


గుండెను దృఢంగా చేస్తుంది:
హైబిస్కస్ టీ లేదా మందార సప్లిమెంట్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయని అనేక పరిశోధనలు వెల్లడించాయి. అంతే కాదు గుండె సంబంధిత సమస్యలు లేని వారు కూడా ఈ టీని త్రాగవచ్చు. హైబిస్కస్ టీ రక్తపోటును తగ్గించే ఔషధంలా పనిచేస్తుంది. దీని రెగ్యులర్ గా త్రాగడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. అంతే కాకుండా హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంలో కూడా ఈ టీ మీకు సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది:
ఈ రోజుల్లో, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం అనేది చాలా సాధారణ సమస్య. మీరు వృద్ధులైనా లేదా యువకులైన మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటే ఈ టీని తీసుకోవడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. తరుచుగా మందార పూలతో తయారు చేసిన టీ త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడే వారు మందార పూలతో తయారు చేసిన టీ త్రాగడం వల్ల ఈజీగా శరీరంలోని కొవ్వు తగ్గిపోతుంది.


మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
అనేక అధ్యయనాల ప్రకారం, మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడే హైబిస్కస్ టీలో రెండు విషయాలు కనిపిస్తాయి. ఇన్సులిన్ శరీరం అంతటా గ్లూకోజ్ లేదా రక్తంలో చక్కెరను రవాణా చేస్తుంది. తద్వారా ఇది ఇంధనంగా ఉపయోగించబడుతుంది. హైబిస్కస్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ సమస్య తగ్గుతుందని అనేక పరిశోధనలు వెల్లడించాయి.

Also Read: ఈ ఫ్రూట్స్ తింటే.. ఈజీగా వెయిట్ లాస్

మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది:
మీరు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలనుకుంటే..రు హిబ్సిక్స్ టీని తప్పకుండా త్రాగాలి. ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టం నుండి మీ శరీరాన్ని రక్షించడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ ఫ్రీ రాడికల్స్ కారణంగా, మీ వృద్ధాప్య వేగం పెరుగుతుంది. దీని ప్రభావం మీ చర్మంపై నేరుగా కనిపిస్తుంది.   అందుకే తరుచుగా మందార పూలతో తయారు చేసిన టీ త్రాగడం అలవాటు చేసుకోండి. దీని వల్ల యవ్వనంగా ఉంటారు.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×