Pimple Problem: ప్రస్తుతం చాలా మంది ముఖంపై మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు రకరకాల రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్రొడక్ట్స్ వాడకుండా ఇంట్లోనే మొటిమలను తగ్గించుకోవచ్చు. ఎఫెక్టివ్ హోం రెమెడీస్‌ని వాడటం వల్ల ముఖంపై ఒక్క మొటిమ కూడా లేకుండా చేసుకోవచ్చు.
రసాయనాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ వాడటం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు తగ్గడం కాకుండా మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది. ఇటువంటి పరిస్థితిలోనే ఇంట్లో ఉన్న కొన్ని రకాల ప్రొడక్ట్స్ వాడటం వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మొటిమలు తగ్గుతాయి.
ముఖంపై మొటిమలు మీ అందాన్ని పాడు చేస్తాయి. దానివల్ల మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలోనే అలోవెరా జెల్, శనగపిండి, వేప ఆకుల పేస్ట్ తో పాటు కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం మంచిది.
1. అలోవెరా జెల్..
కలబందలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మానికి తేమనుకూడా అందిస్తుంది.
ఎలా వాడాలి ?
1.తాజా కలబంద నుంచి జెల్ తీయండి.
2.దీన్ని నేరుగా మొటిమలపై అప్లై చేసి 20-30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
3.తర్వాత చల్లటి నీటితో కడగాలి.
4.అలోవెరా జెల్‌ని రోజు ఫేస్ పై అప్లై చేయడం వల్ల మొటిమలు త్వరగా తగ్గుతాయి.
5.ముఖం అందంగా మారుతుంది.
2. శనగ పిండి, పెరుగు ఫేస్ ప్యాక్ :
శనగ పిండి చర్మంపై ఉన్న మురికి, జిడ్డును తొలగిస్తుంది. పెరుగు చర్మాన్ని మృదువుగా, తేమగా మారుస్తుంది. వీటితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడటం వల్ల ముఖం అందంగా మారుతుంది.
ఎలా తయారు చేయాలి ?
1. ముందుగా ఒక బౌల్ లో 2 చెంచాల శనగపిండి, 1 చెంచా పెరుగు కలిపి పేస్ట్‌లా చేయండి.
2. దీనిని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత మృదువుగా మసాజ్ చేసి కడిగేయాలి.
3. వారానికి రెండుసార్లు దీనిని ఉపయోగించండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి.
4. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది.
3. వేప ఆకుల పేస్ట్:
వేప సహజంగానే యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
ఎలా వాడాలి ?
1. తాజా వేప ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి.
2. దీన్ని మొటిమల మీద రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
3. వారానికి రెండుసార్లు దీనిని ఉపయోగించడం వల్ల ముఖం అందంగా మారుతుంది.
4. ఐస్:
మొటిమలు.ఫేస్ పై ఎరుపు ఉన్న చోట ఐస్ అప్లై చేయడం ద్వారా సమస్యను తగ్గించవచ్చు. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న జిడ్డును కూడా తొలగిస్తుంది.
1. ఒక క్లాత్ తీసుకుని దానిలో ఐస్ ముక్కలను వేసి మొటిమలు ఉన్న చోట 1-2 నిమిషాలు ఉంచండి.
2. రోజుకు 2-3 సార్లు ఇలా చేయండి.
3. ఐస్ వాడటం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు తగ్గుతాయి.
Also Read: కీరదోస తింటే ఎటువంటి ప్రమాదకర సమస్యలు అయినా పరార్..
5. నారింజ తొక్కల పేస్ట్ :
నారింజలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి పోషణనిచ్చి మొటిమల సమస్యను దూరం చేస్తాయి.
ఎలా వాడాలి ?
1. ఎండిన నారింజ తొక్కలను గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి.
2. ఈ పౌడర్‌లో రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా చేసుకోవాలి.
3. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
4. ఈ రెమెడీ స్కిన్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది.