Homemade Face Packs: మారుతున్న జీవన శైలితో పాటు అనేక అనారోగ్య సమస్యల వల్ల కూడా ముఖంపై మొటిమలు వస్తుంటాయి. ప్రస్తుతం చాలా మంది ముఖంపై మొటిమల సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు రసాయనాలతో తయారు చేసిన ఫేస్ క్రీములను వాడకుండా హోం మేడ్ ఫేస్ ప్యాక్‌లను వాడితే మంచి ఫలితం ఉంటుంది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
1. ఓట్స్ ,పెరుగు ఫేస్ ప్యాక్:
కావలసినవి:
ఓట్స్- 2 టేబుల్ స్పూన్స్
పెరుగు – 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం:
ముందుగా ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి 2 చెంచాల ఓట్స్ ను గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో పెరుగును కలపండి. ఆ తర్వాత వీటితో తయారు చేసిన ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీని వల్ల చర్మంపై ఉండే మొటిమలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఓట్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.పెరుగు చర్మానికి తేమను అందిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తరుచుగా వాడటం వల్ల ముఖం కాంతి వంతంగా మెరుస్తుంది. మొటిమలు తొలగిపోయి చర్మం మరింత మృదువుగా కనిపిస్తుంది.
2. అలోవెరా, హనీ ఫేస్ ప్యాక్:
కావలసినవి:
కలబంద జెల్- 2 టేబుల్ స్పూన్లు
తేనె- 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా పైన చెప్పినట్లు అలోవెరా జెల్ , తేనెను తీసుకుని ఫేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీని వల్ల ముఖంపై ఉన్న మొటిమలు తగ్గుతాయి. ఈ ఫేస్ ప్యాక్ లోని కలబంద చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా ఇందులలోని తేనె చర్మానికి పోషణనిస్తుంది.
3. అరటి , తేనె ఫేస్ ప్యాక్:
కావలసినవి:
అరటిపండు – 1 (బాగా పండినది)
తేనె – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి, దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపండి. దీనిని మిశ్రమంలా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీనిలోని అరటిపండు చర్మానికి తేమను అందిస్తుంది. తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఈ ఫేస్ తరుచుగా వాడటం వల్ల ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి.
Also Read: ఈ ఫేస్ ప్యాక్‌తో మొటిమలు లేని స్కిన్ !
4. టమోటా , నిమ్మకాయ ఫేస్ ప్యాక్:
కావలసినవి:
టమాటా గుజ్జు-2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ఈ ఫేస్ ప్యాక్ కోసం పైన చెప్పిన మోతాదుల్లో టమోటా గుజ్జును తీసి, దానికి నిమ్మరసాన్ని కలపండి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాలు ఉంచిన తర్వాత కడిగేయాలి. ఈ పేస్ ప్యాక్ ద్వారా ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. ముఖ్యంగా మొఖంపై మొటిమలు తగ్గడానికి ఈ ఫేస్ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)