EPAPER

Homemade Face Pack: అందమైన ముఖం కోసం.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Homemade Face Pack: అందమైన ముఖం కోసం.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Homemade Face Pack: చర్మం అందంగా మెరుస్తూ ఉండాలని అందరూ తహతహ లాడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు వేలల్లో ఖర్చు చేసి ఫేస్ ప్రొడక్స్ట్ కొని వాడుతుంటారు. అయినప్పటికీ చాలా మంది జిడ్డు చర్మం ఉన్న వారికి తరుచుగా ముఖంపై బ్లాక్ హెడ్స్, మొటిమలు వస్తుంటాయి. మొటిమలు రాకుండా ఉండటానికి ఇంట్లో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడవచ్చు. వీటిని వాడటం వల్ల ముఖ్యంగా స్కిన్ మరింత కాంతి వంతంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోతాయి.


ప్రతి ఒక్కరు తమ చర్మం మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. కాని కొంత మందికి జిడ్డు చర్మం ఉంటుంది. అలాంటి వారికి తరుచుగా ముఖంపై మొటిమలు వస్తుంటాయి. ముఖంపై ఆయిల్‌ను నియంత్రించడం చాలా కష్టం. అయితే దీన్ని నియంత్రించుకోకపోతే బ్లాక్ హెడ్స్, మొటిమల వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కూడా ఆయిల్ స్కిన్‌తో ఇబ్బంది పడుతుంటే కనక.. మార్కెట్‌లో దొరికే ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉంటే మంచిది. ముఖంపై జిడ్డు తొలగించడంతో పాటు చర్మం ఆరోగ్యంగా మెరిసేలా చేయడానికి ఫేస్ ప్యాక్స్ ఉపయోగపడతాయి. సహాయపడే అటువంటి హోం మేడ్ ఫేస్ ప్యాక్‌ల గురించి ఇక్కడ మేము మీకు తెలియజేస్తున్నాం.

కాఫీ-మిల్క్- తేనె ఫేస్ ప్యాక్:
ఆయిల్ స్కిన్ ఉన్న వారికి కాఫీ, పాలు తేనెతో చేసిన ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మూడింటితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ అద్భుతమైన ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేస్తుంది. ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం తేమగా ఉండటమే కాకుండా చర్మానికి సహజసిద్ధమైన టోన్‌ను కూడా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా అదనపు నూనెలను కూడా తొలగిస్తుంది. ఈ ప్యాక్ తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక గిన్నెలో కాఫీ, పాలు, తేనెను సమాన పరిమాణంలో తీసుకుని కలపండి. ముందుగా ముఖాన్ని బాగా శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.


Also Read: ఈ ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

పెరుగు, తేనె -పసుపు ఫేస్ ప్యాక్:
ఆయిల్ స్కిన్‌కి పెరుగు చాలా మేలు చేస్తోంది. ఇది ముఖం నుంచి అదనపు నూనెలను తొలగిస్తుంది. అంతే కాకుండా అనేక చర్మ సంబంధిత సమస్యలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. పెరుగు, తేనె, పసుపు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ముఖానికి వాడితే అది మొటిమల సమస్య తొలగిపోయి చర్మం హైడ్రేటెడ్ గా కనిపించేలా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి 3 టేబుల్ స్పూన్ల పెరుగును తేనెతో కలపాలి. దానికి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపాలి. ఇలా తయారు చేసిన ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ని వారానికి ఒకసారి వాడితే మంచి ఫలితం ఉంటుంది. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Fennel Water For Weight Loss: సోంపు వాటర్‌తో వెయిట్ లాస్..

Foods For Children: మీ పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి ఈ ఆహారం ఇవ్వండి

Liver Health: కాలేయాన్ని శుభ్రపరిచే డ్రింక్స్ ఇవే !

Tips To Keep Lizards Out Of Kitchen: కిచెన్‌లో బల్లి తిరుగుతోందా?.. ఈ చిట్కాలు పాటిస్తే ఇక రావు!

Fenugreek Water Benefits: షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పకుండా తాగాల్సిన డ్రింక్ ఏంటో తెలుసా ?

Beauty Tips: మీ ఫేస్ డల్‌గా కనిపిస్తుందా? వీకెండ్‌లో ఓసారి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.

Waxing Tips: కాళ్ళకీ, చేతులకి వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత ఈ పనులు చేయకండి, చర్మం నల్లగా మారిపోతుంది

Big Stories

×