Big Stories

Pesticides on Fruits: డేంజర్.. పండ్లపై క్యాన్సర్ ప్రేరేపిత పురుగుల మందులు.. ఎలా తొలగించాలి..?

How to Clean Pesticides on Fruits: పండ్లలో పోషకాలు పుష్కలం. ఆరోగ్యంగా ఉండటానికి పండ్లను, పండ్ల రసాలను ఎక్కువగా తినాలి. సీజన్ల వారిగా దొరికే పండ్లను అస్సలు మిస్ చేయకూడదు. ఇంట్లో పెద్దవాళ్లేంటి.. వైద్యులు కూడా ఇదే చెబుతారు. కానీ.. ఇప్పుడు మార్కెట్లలోకి వచ్చే పండ్లు తింటే ఆరోగ్యంగా ఉండటం మాట దేవుడెరుగు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే కాయలు త్వరగా పండ్లు అవ్వడానికి వాడే పురుగుల మందుల కారణంగా క్యాన్సర్ వస్తుందట.

- Advertisement -

అలాంటి పండ్లను తింటే ఆరోగ్యం బాగుండటం కాదు.. ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడటం ఖాయం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి ? పండ్లపై రసాయనాలను ఎలా తొలగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

పండ్లను కొన్నాక.. వాటిని తినే ముందు నీటిలో కనీసం అరగంట సమయం నానబెట్టాలి. చేతితో వాటిని రుద్దుతూ కడిగి.. ఆ నీటిని తీసేసి మరోసారి కడగాలి. ఇలా చేస్తే.. పెర్టిసైడ్స్ పోయే అవకాశముంది.

Also Read : పచ్చిమిర్చి నానబెట్టిన నీళ్లు ఎప్పుడైనా తాగారా..? ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

అలాగే.. నీటిలో ఉప్పువేసి.. అందులోనే పండ్లను అరగంట సమయంపాటు ఉంచాలి. ఆ నీటిలో పండ్లను శుభ్రం చేశాక.. మంచినీటితో మరోసారి శుభ్రం చేసుకోవాలి.

కొందరు పండ్లపై ఉన్న తొక్కను తీసేసి తింటారు. యాపిల్, మామిడి వంటి పండ్లపై తొక్కలను తీసివేస్తారు. వీటిపైనే రసాయనాలు, పురుగుల మందులు పేరుకుపోయి ఉంటాయి. కాబట్టి ఇలా తొక్కలను తొలగించి తినడం మంచిదే.

ఒక గిన్నెలో రెండు చుక్కల వెనిగర్ వేసి కలపాలి. ఆ నీటిలో పండ్లను వేసి 1 నిమిషంపాటు వదిలేయాలి. వాటిని కుళాయి కింద పెట్టి చేతితో రుద్దుతూ కడగాలి. పండ్లను టవల్ తో తుడిచి త్వరగా పొడిగా అయ్యేలా చేయాలి.

Also Read: Sugar Patients : మండుటెండలతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు డేంజర్.. వైద్యుల సూచనలు

బేకింగ్ సోడాతోనూ పండ్లను శుభ్రం చేయవచ్చు. నీటిలో బేకింగ్ సోడా వేసి.. పండ్లను నానబెట్టాలి. కొద్దిసేపటి తర్వాత పండ్లను అందులో నుంచి తీసి.. ట్యాప్ వాటర్ తో శుభ్రం చేయాలి. పండ్లు, కూరగాయల్ని ఇలా శుభ్రం చేస్తే వాటిపై ఉండే పెస్టిసైడ్స్ పోతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News