ముంబై రైల్వే స్టేష్టన్ లో ఘోరం జరిగింది. బాంద్రా టెర్మినస్ లో ఓ కిరాతకుడు మహిళపై దారుణానికి పాల్పడ్డాడు. తన కుమారుడితో రైలు ఎక్కేందుకు స్టేషన్ లోకి వెళ్లిన మహిళపై ఓ కూలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరానికి పాల్పడిని దుండగుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించాడు. ఈ ఘటన ఫిబ్రవరి 1 రాత్రి జరిగినట్లు తెలిపారు.
పోలీసులు ఏం చెప్పారంటే?
ఈ నెల 1న(శనివారం) ఓ మధ్య వయసు మహిళ కొడుకుతో కలిసి రాత్రి అవుట్ స్టేషన్ రైలులో బాంద్రా టెర్మినస్ కు వచ్చింది. ఆ రైలు దిగిన తర్వాత.. ఆ మహిళ ప్లాట్ ఫారమ్ కు అవతలి వైపు ఆగిన మరొక రైలులోకి వెళ్లింది. ఆ సమయంలో ఇతర రైలులో ఒక పోర్టర్ తప్ప ప్రయాణీకులు ఎవరూ లేరు. అప్పుడే మహిళపై దుండగుడు అత్యాచారం చేశాడు. కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. అక్కడ పడి ఉన్న మహిళను రైల్వే సిబ్బంది గమనించి ఆరా తీశారు. అసలు విషయం తెలియడంతో రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సదరు మహిళ ఇచ్చిన సమాచారం ప్రకారం పోర్టర్ మీద కేసు నమోదు చేశారు.
సీసీ టీవీ ఫుటేజీ ద్వారా నిందితుడి గుర్తింపు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు రైల్వే స్టేషన్ పరిధిలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ విజువల్స్ లో నిందితుడిని గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడైన పోర్టర్‌పై భారతీయ న్యాయ సంహిత కింద అత్యాచారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. అయితే, సదరు మహిళ బాంద్రా టెర్మినస్ లో దిగిన తర్వాత ఆ మహిళ మరో రైలులోకి ఎందుకు ప్రవేశించిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: గిన్నిస్ రికార్డుల్లోకి ఢిల్లీ రైల్వే స్టేషన్, కారణం ఏంటో తెలుసా?
అటు నవీ ముంబైలో 12 ఏండ్ల బాలికపై అత్యాచారం
అటు గత నెల 29న నవీ ముంబై టౌన్ షిప్ లో ఘోరం జరిగింది. కొంత మంది దుండగులు ఓ 12 ఏండ్ల అమ్మాయిని వదిలివేసి వెళ్లారు. స్టేషన్ లో ఏడుస్తూ కూర్చున్న అమ్మాయిని రైల్వే అధికారులు గమనించారు. ఆమె నుంచి వివరాలు సేకరించారు. కొంత మంది యువకులు తనపై అత్యాచారం చేసి, రైల్వే స్టేషన్ లో వదిలి వెళ్లినట్లు వెల్లడించింది. అమ్మాయిని వైద్య పరీక్షలకు పంపగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. స్టేషన్ పరిసరాల్లోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. రెండు, మూడు రోజుల వ్యవధిలో రెండు అత్యాచార ఘటనలు జరగడం పట్ల రైల్వే పోలీసులు అలెర్ట్ అయ్యారు. పలు స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read Also: భారతీయ రైల్వేలో విద్యుదీకరణకు 100 ఏండ్లు, ఛత్రపతి శివాజీ టెర్మినల్ లో శతాబ్ది ఉత్సవాలు!