Allu Arjun About Ayaan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోని అభిమానులు ఎంతగా ప్రేమిస్తారో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక హీరోని ప్రేమించడం మొదలుపెడితే వాళ్ల కుటుంబ సభ్యులను కూడా ప్రేమించడం అలవాటు చేసుకుంటారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది మెగా ఫ్యామిలీ నుంచి కానీ, అక్కినేని ఫ్యామిలీ నుంచి కానీ, నందమూరి ఫ్యామిలీ నుంచి కానీ హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవిని ప్రేమించడంతోపాటు ఆ కుటుంబ సభ్యులకు కూడా అభిమానులు మొదలయ్యారు. ఇప్పటికీ మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు వాళ్ళందరి సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగుంటే ఆదరిస్తారు. కొన్నిసార్లు సినిమా బాగా లేకపోయినా కూడా, ఆయా హీరోలు మంచి సినిమా తీసే వరకు ఎదురుచూస్తూ ఉంటారు అది తెలుగు ఆడియన్స్ గొప్పతనం.
Also Read : Allu Arjun : నేషనల్ అవార్డు ను నేను తెలుగు హీరోస్ కి డేడికేట్ చేస్తా
ఇక ప్రస్తుతం తెలుగులో చాలామంది స్టార్ హీరోస్ ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ ఎంట్రీ కోసం చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార యాడ్స్ లో నటించి మంచి పాపులారిటీ సాధించుకుంది. యాడ్స్ లో నటించడం కంటే ముందే తన తండ్రి సినిమాల్లోని సూపర్ హిట్ పాటలను రీల్స్ గా చేసి ఇన్స్టాగ్రామ్ వేదికగా మంచి గుర్తింపు సాధించింది. సితార టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరిద్దరూ ఎంతగా ఫేమస్ అయ్యారు మరొక వ్యక్తి కూడా అంత ఫేమస్ అయ్యాడు. అతని అల్లు అయాన్. అయాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సోషల్ మీడియాలో అయాన్ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయాన్ ఎంత చురుగ్గా ఉంటాడో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. తన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతాయి.
Also Read : Allu Arjun: మహేష్ బాబు, ప్రభాస్ కంటే నాకు నేనే పోటీ
పుష్ప సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో అల్లు అర్జున్ బాలకృష్ణ చేసే అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా హాజరయ్యాడు. అయితే ఈ షో లో చాలా ప్రశ్నలను ఎదుర్కొన్నారు అల్లు అర్జున్. ఒక సందర్భంలో అల్లు అయాన్ గురించి కూడా మాట్లాడారు. అయాన్ అనే వాడు అనిమల్ సినిమాలో రన్బీల్ కపూర్ లాంటివాడు. వాళ్ళ నాన్న కోసం ఎంతకైనా తెగిస్తాడు. అదే వాళ్ళ అమ్మ విషయంలో మాత్రం వాళ్ళ నాన్నను కూడా విడిచిపెట్టడు అంటూ నవ్వుతూ చెప్పాడు అల్లు అర్జున్. ఇక అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ కుమార్తె ఎంత యాక్టివ్ గా ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించి చాలామందిని ఆకట్టుకున్నారు అల్లు అర్జున్ కూతురు అర్హ.