BigTV English

Brain Tumor : ఈ ప్రదేశంలో తరచూ నొప్పి ఉంటుందా.. బ్రెయిట్ ట్యూమర్ కావొచ్చు!

Brain Tumor : ఈ ప్రదేశంలో తరచూ నొప్పి ఉంటుందా.. బ్రెయిట్ ట్యూమర్ కావొచ్చు!
brain tumor symptoms
brain tumor symptoms

Brain Tumor Symptoms : ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిన్ ట్యూమర్‌ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల వెల్లడించిన ఓ అధ్యయనం ప్రకారం.. బ్రెయిన్ ట్యూమర్ పిల్లలు మరియు యుక్తవయస్సులో ఎక్కువగా కనిపిస్తుందని వెల్లడించింది.


అయితే బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి చాలా మందికి తెలియదు. దీని కారణంగానే ఎక్కువ మంది మరణిస్తున్నారని సెంట్రల్ బ్రెయిన్ ట్యూమర్ రిజిస్ట్రీ తెలిపింది. కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ మరణాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ దాని ముందస్తు సంకేతాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ గణాంకాల ప్రకారం.. గత 5 సంవత్సరాలలో బ్రెయిన్ ట్యూమర్ కేసులు 0.5 నుండి 0.7 శాతానికి పెరిగాయి. ఈ బ్రెయిన్ ట్యూమర్ వృద్ధులలో తక్కువగా, యుక్తవయస్సులో ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటో తెలుసుకుందాం.


READ MORE : పిల్లలతో మీరు నిద్రిస్తున్నారా.. మీకో హెచ్చరిక..!

మెదడు మరియు దాని సమీపంలో కణాల అసాధారణ పెరుగుదలనే బ్రెయిన్ ట్యూమర్ అంటారు. బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులోని ఏదైనా భాగంలో కనిపించవచ్చు. ఇది వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. మెదడు లోపల భాగంలో ట్యూమర్ ఏర్పడితే ‘గ్లయోమస్’ , మొదడు పొరలపై ట్యూమర్ ఏర్పడితే ‘మెనింజియోమస్’ అని అంటారు.

ట్యూమర్ ఏ రకమైనా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మెదడు చుట్టూ ఉన్న పుర్రె చాలా గట్టిగా ఉంటుంది. ఆ ప్రాంతం కూడా చాలా పరిమితంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో కణాల అసాధారణ పెరుగుదల మెదడులో సమస్యలను కలిగిస్తుంది.

అంతేకాకుండా మెదడులో కణితులు పెరిగినప్పుడు.. అవి చాలా ఒత్తడిని కలిగిస్తాయి. మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకం కావచ్చు. ట్యామర్‌లను ముందుగానే గుర్తించడం వల్ల ప్రాణాప్రాయం నుంచి బయటపడొచ్చు.ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ముందస్తు లక్షణాలు ఏంటో చూద్దాం.

తలనొప్పి

మెదడులో ట్యూమర్ ఏర్పడితే తలనొప్పి రావడం సాధారణ లక్షణం. తలనొప్పి తీవ్రంగా, నిరంతరంగా ఉంటుంది. ఈ రోజుల్లో తలనొప్పి అనేది చాలా సాధారణ సమస్య కాబట్టి చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ట్యూమర్ వల్ల తలనొప్పి ఉదయాన్నే నిద్రలేచినప్పుడు, నిద్రలో ఎక్కువగా ఉంటుంది.

దృష్టిలో మార్పు

మెదడులో కణితల కారణంగా దృష్టిలో ఒక్కసారిగా మార్పును గమనించవచ్చు. దృష్టి కొంచెం అస్పష్టంగా ఉంటుంది. ఏవి చూసినా కంటికి రెండుగా కనిపిస్తాయి. కొన్ని ట్యూమర్స్.. దృష్టి సమస్యలను కలిగిచడంతో పాటు దృష్టిని కోల్పేయేలా చేస్తాయి.

వికారం,వాంతులు

మెదడులో కణితలో ఒత్తిడి కారణంగా కొన్ని సందర్భాల్లో వికారం, వాంతులు సంభవిస్తాయి. అయితే ఇవి ఇతర అనారోగ్య సమస్యల వల్ల కూడా రావచ్చు. ఎవరైనా తలనొప్పితో పాటు ఈ రెండు లక్షణాలను తరచుగా అనుభవిస్తే.. వైద్యులను సంప్రదించండి.

మూర్ఛ

మెదడులో ట్యామర్ పెరుగుతున్నప్పుడు మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల మూర్ఛపోతారు. ఒక వ్యక్తికి వివిధ కారణాల వల్ల మూర్ఛ వచ్చినప్పటికీ.. యువకులలో ఎక్కువగా ఉంటే న్యూరోలాజిక్ పరీక్ష, మెదడు స్కాన్ చేయించుకోవాలి.

READ MORE : మీ పొట్టలో ఇవి పడితే.. పొట్ట క్యాన్సర్ రావడం ఖాయం!

తిమ్మిరి

మెదడులో అభివృద్ధి చెందే ట్యామర్‌లు న్యూరాన్ మార్గాలను ప్రభావితం చేస్తాయి. దీని వల్ల శరీరంలోని కొన్ని భాగాలు బలహీనంగా మారి తిమ్మిర్లు వస్తాయి. ఈ తిమ్మిర్లు ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించండి.

బ్రెయిన్ ట్యూమర్ నివారణ చర్యలు

  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
  • ఆరోగ్యకరమైన ముదురు ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
  • ధూమపానం మరియు మద్యపానానికి దూరంగా ఉండాలి.
  • ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.
  • మానసికంగా చురుకుగా ఉండాలి.
  • శరీరం రేడియేషన్‌కు గురికాకుండా చూడాలి
  • అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించుకోవాలి.
  • బైక్ నడుపుతున్నప్పుడు, క్రీడల్లో పాల్గొంటున్నప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలి.

Disclaimer : ఈ సమాచారాన్ని పలు అధ్యయనాల ప్రకారం, ఆరోగ్య నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా మాత్రమే భావించండి.

Tags

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×