Stomach Cancer Causes : క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా ఎక్కువ మంది పొట్ట క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ పొట్ట క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. పొట్ట లోపల కణాలు అనియంత్రితంగా పెరగడం క్యాన్సర్‌కు ముఖ్య కారణంగా చెబుతున్నారు నిపుణులు. కణాల అనియంత్రత వల్ల అది క్యాన్సర్ కణితిగా మారుతుంది.
అంతేకాకుండా గ్యాస్ట్రిక్, అల్సర్ల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పొట్ట క్యాన్సర్ కారణంగా 95 శాతం పొట్ట లైనింగ్‌లో క్యాన్సర్ కణాలు పెరుగుతాయి. ఈ సమస్యను గుర్తించకపోతే అది తీవ్రమైన క్యాన్సర్‌గా మారుతుంది. ఇది కాలేయం, ప్యాంక్రియాటిక్ అవయవాలకు సోకుతుంది. కాబట్టి పొట్ట క్యాన్సర్ లక్షణాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
READ MORE : హార్ట్ ఎటాక్.. వంశపార్యం పరంగా వస్తుందా..?
పొట్ట క్యాన్సర్‌కు కారణాలు
గ్యాస్ట్రిక్, అల్సర్లు తీవ్రమైన పొట్ట క్యాన్సర్‌కు దారి తీయొచ్చు. ఈ సమస్యలు ముదరకుండా చికిత్స చేయించుకోవడం చాలా అవసరం. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా మన పొట్టకు హాని కలిగిస్తాయి. ఇందులో చేపలు, మాంసం, ఊరగాయలు వంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిలో అధికంగా ఉప్పు వేసి నిల్వ చేయడం వల్ల ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
అంతేకాకుండా ప్రాసెస్ చేసిన ఆహారాలు, కాల్చిన లేదా బొగ్గుల మీద వండిన మాంసాలను తినడం వల్ల కూడా పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టైప్ 2 డయాబెటిస్, ఊబకాయంతో బాధపడేవారు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలు, జన్యుపరమైన కారణాల వల్ల కూడా కొందరిలో క్యాన్సర్ వస్తుంది. మీ వంశంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ప్రాసెస్ చేసిన మాంసం, ధూమపానం, ఉప్పు నిండిన ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాలంలో పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాసేజ్‌లు వంటివి అధికంగా తిన్నా ఈ వ్యాధి వస్తుంది. ఇటువంటి ఆహారాలు పొట్టలో చేరి క్యాన్సర్ కాణాలను సృష్టిస్తాయి.
ఫ్రై చేసిన ఆహారాలు నోటికి చాలా రుచిగా ఉంటాయి. కానీ ఇవి పొట్ట క్యాన్సర్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి. ఎక్కువ వేడిగా ఆహారాలను వేయించడం వల్ల అందులో ఉన్న పిండి పదార్థాలు అక్రిలమైడ్ అనే రసాయనాలను పొట్టలో విడుదల చేస్తాయి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
READ MORE : ఈ ఫుడ్స్ తో మీ లంగ్స్ దొబ్బేయటం ఖాయం!
బంగాళదుంపతో చేసే వంటకాలను డీప్ ఫ్రై చేయడం వల్ల కాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలను తినడం మానేయండి. లేదంటే ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని మరింతగా పెంచుతాయి. అలానే చక్కెరతో నిండినా ఆహారాలు కూడా పొట్ట క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. చక్కెర పదార్థాలు పొట్ట క్యాన్సర్‌కు పరోక్షంగా తోడ్పడుతున్నాయి. తీయగా ఉండే కూల్ డ్రింక్స్, చక్కెర, బియ్యం, ఆల్కహాల్ పొట్ట క్యాన్సర్ అవకాశాలను పెంచుతాయి. ఆల్కహాల్ కాలేయంలో చేరాక విచ్ఛిన్నమై క్యాన్సర్ కారక కణాలను ఉత్పత్తి చేస్తుంది.
Disclaimer : ఈ సమాచారాన్ని ఆరోగ్య నిపుణుల సలహా మేరకు, పలు అధ్యయనాల ఆధారంగా ఈ కథనాన్ని అందిస్తున్నాం.