BigTV English

Overian Cancer: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి

Overian Cancer: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి

Overian Cancer: ఇటీవల క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వయసుతో తేడా లేకుండా క్యాన్సర్ బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారం కారణంగా చాలా మంది క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాలను తీసే హానికరమైనవి ఇటీవల ఎక్కువవుతుంది. అయితే ఈ క్యాన్సర్ ప్రారంభదశలో ఉండగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడినవారు ఎవరైనా వెంటనే ప్రాణాలను కోల్పోతున్న దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.


గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వాటిని ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిది. అయితే దీనికి ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలిసి ఉండదు. గర్భాశయ క్యాన్సర్ బారిన పడిన వారికి పొత్తి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అపాన వాయువు అధికంగా రావడం వంటి సమస్యలు ఉంటాయి. అంతేకాదు ముఖ్యంగా అసిడిటీ వంటి సమస్య ఉన్నా అది గర్భాశయ క్యాన్సర్ కు లక్షణమనే నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి సమస్యలు తరచూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. మరోవైపు మూత్ర విసర్జన, మూత్రంలో రక్తస్రావం వంటివి కూడా గర్భాశయ క్యాన్సర్ లక్షణాలే. అయితే ఇలాంటి లక్షణాలు ఉంటే చాలా మంది మధుమేహం అనుకుని చికిత్స చేయించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. బరువు తగ్గడం, అలసటగా ఉండడం, తరచూ నీరసం వంటివి కూడా గర్భాశయ క్యాన్సర్ లక్షణాలే. ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.


Tags

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×