BigTV English

Shavasana Benefits: ఖాళీగా ఉన్న సమయంలో ఒక్కసారి ఈ శవాసనం ట్రై చేయండి.. లాభాలు తెలిస్తే పక్కా చేసేస్తారు

Shavasana Benefits: ఖాళీగా ఉన్న సమయంలో ఒక్కసారి ఈ శవాసనం ట్రై చేయండి.. లాభాలు తెలిస్తే పక్కా చేసేస్తారు

Shavasana Benefits: ప్రస్తుతం ఉన్న జీవనశైలి విధానంలో యోగా అనేది చాలా ముఖ్యం. మాససికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉండడానికి యోగా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే చాలా మందికి బిజీ లైఫ్ కారణంగా యోగా, వ్యాయామం చేయడానికి అస్సలు సమయం ఉండదు. అటువంటి పరిస్థితిలో కొన్ని యోగాసనాలు చాలా సుభంగా చేసే విధంగా ఉంటాయి. యోగాలో చాలా రకాలు ఉంటాయి. ఇవి అనేక వ్యాధులు, శారీరక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా ఇందులో శవాసనం అయితే ఎటువంటి శ్రమ లేకుండా చేసేయోచ్చు. శరీరం అలసట, నీరసం నుంచి విముక్తి కోసం ఈ శవాసనం అద్భుతంగా పని చేస్తుంది. శరీరాన్ని చాలా రిలాక్స్ చేస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు కూడా సహాయపడుతుంది.


రక్తపోటు వంటి సమస్యను తగ్గించేందుకు శవాసనం పనిచేస్తుంది. కేవలం దీనికి ఎటువంటి శారీరక శ్రమ లేకుండా సులభంగా చేసేయవచ్చు. కేవలం శవంలా పడుకుని ఉంటే చాలు. ఇది యోగాలో అందరికీ ఇష్టమైన ఆసనం కూడా. ఎందుకంటే పనుల్లో బిజీగా ఉండేవారు కాసేపు శవంలా పడుకుని ఈ ఆసనం వేస్తే సరిపోతుంది. అయితే ఈ శవానసం వేసే సమయంలో ఎటువంటి ఆలోచనలు లేకుండా, కళ్లు మూసుకుని మనస్సు, శరీరం రెండింటికి విశ్రాంతిని ఇవ్వాలి.

ఇలా తరచూ కేవలం 10 నిమిషాలు చేయడం వల్ల రక్తపోటు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శవాసనం వల్ల మెదడు పని తీరు కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు మెదడును ఉత్సాహంగా కూడా తయారుచేస్తుంది. ముఖ్యంగా పని వల్ల మెదడుపై ఏర్పడే ఒత్తిడిని కూడా ఈ ఆసనం తొలగిస్తుంది. ప్రశాంతంగా ఉండేలా రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. రాత్రి వేళ నిద్ర సరిగా పట్టకపోతే శవాసనం వేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. దీనిని అలవాటు చేసుకున్న వారిలో మంచి ఫలితాలు కనిపిస్తాయి.


శవాసనం వేసిన సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. కళ్లు మూసుకుని చేతులు, కాళ్లు చాచి పడుకోవాలి. ఎటువంటి ఆలోచనలు లేకుండా పడుకోవాలి. ఈ క్రమంలో శ్వాసను తీసుకుంటూ దానిపై ద్యాస పెట్టాలి. ఇలా చేయడం వల్ల గుండె సంబంధింత సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. రక్తపోటు, మెదడు పనితీరు, అలసట వంటి వాటికి ఉపయోగపడుతుంది. తరచూ వ్యాయామం చేసే వారు కూడా వాకింగ్, వ్యాయామం వంటివి చేసిన అనంతరం కాసేపు శవాసనం వేసినా కూడా శారీరక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. దీని వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Vitamin K Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Big Stories

×