Big Stories

Dementia : మీ కళ్లలో ఒక లోతైన రహస్యం దాగి ఉంది.. అదేంటో తెలుసా?

Dementia : మీ కళ్లలో ఒక లోతైన రహస్యం దాగి ఉంది. మన శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా కళ్లు ఇట్టే చెప్పేస్తాయి. అందుకే మీరు డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు వారు మొదట మీ కళ్లను చూస్తారు. మీ కంటి చూపు బలహీనంగా ఉంటే ఆ తర్వాత డిమెన్షియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. దీన్ని చిత్తవైకల్యం అని కూడా అంటారు. కారణంగా మతిమరుపు వస్తోంది. ఇది ప్రస్తుతం సంపన్న దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మన జీవనశైలి అనారోగ్యకరంగా మారుతున్నందున రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియా ప్రమాదం వేగంగా పెరుగుతుందని అనేక అధ్యాయనాల్లో తేలింది.

- Advertisement -

Also Read : సడెన్‌గా కండరాలు పట్టేస్తున్నాయా? కారణం ఇదే కావచ్చు!

- Advertisement -

ఇంగ్లండ్‌లోని లౌబరో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చిత్తవైకల్యంపై పరిశోధన చేశారు. ఈ అధ్యయనం యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడింది. మన మెదడుకు సంబంధించిన అనేక విషయాల రహస్యాలు మన కళ్లలో ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మతిమరుపు వస్తుందనుకుంటే 12 ఏళ్ల ముందే కళ్లలో ఆ సంకేతాలు కనిపిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. మెదడులోని నరాల సంబంధిత సమస్యల వల్ల డిమెన్షియా వస్తుంది.

ప్రపంచంలో మరణాలకు కారణమైన ఏడవ ప్రధాన కారణం చిత్తవైకల్యం. అధ్యయనం ప్రకారం 5.5 కోట్ల మంది డిమెన్షియా బాధితులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధులే. ఈ వ్యాధిలో వ్యక్తి యొక్క ఆలోచనా సామర్థ్యం బలహీనంగా మారి మతిమరుపు వస్తుంది. అలాంటి వ్యక్తి నిర్ణయాలు తీసుకోలేడు. డిమెన్షియా అనేది ఒక రకమైన జబ్బు. దీనిలో అల్జీమర్స్ వ్యాధి కూడా వస్తుంది.

Dementia
Dementia

ఈ అధ్యయనంలో 8,623 మంది ఆరోగ్యవంతులను భాగస్వామ్యం చేశారు. వారి అన్ని రకాల ఆరోగ్య డేటాను విశ్లేషించారు. అధ్యయనం ముగింపులో వీరిలో 537 మంది తరువాత చిత్తవైకల్యం బారినపడతారని గుర్తించారు.,ఈ వ్యక్తులకు చాలా కాలం క్రితం నుంచే కంటి చూపు తగ్గినట్లు కనుగొన్నారు. ఎవరికైనా డిమెన్షియా ఎప్పుడు వస్తుందో మొదటిలో తెలియదని పరిశోధకులు తెలిపారు. కానీ కంటి చూపు తక్కువగా ఉంటే వారికి డిమెన్షియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు.

Also Read : ఈ చెట్టు కనిపిస్తే కాయలు వదలకండి.. ఎందుకంటే!

కంటి చూపును మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆకుకూరలు, తాజా పండ్లను తినండి. వీలైనంత వరకు స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. మీరు కంప్యూటర్ స్క్రీన్‌పై పని చేస్తే, ప్రతి 20 నిమిషాల తర్వాత విరామం తీసుకోండి. 20 నిమిషాల తర్వాత 20 సెకన్ల పాటు 20 మీటర్ల దూరం చూడండి. ఇది మీ కళ్లకు వ్యాయామంలా పనిచేస్తుంది. మీ కళ్లను రెప్పవేయడం కొనసాగించండి. ఎక్కువసేపు చూస్తూ ఉండకండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News