Big Stories

Health Tips: థైరాయిడ్ ఉందా.. అయితే ఈ డ్రింక్స్ ట్రై చేయండి

Health Tips: ఇటీవల కాలంలో షుగర్, థైరాయిడ్, ఉబకాయం వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా థైరాయిడ్ బారిన పడిపోతున్నారు. అయితే దీనికి హార్మోన్ అసమతుల్యత వల్లే ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ బారిన పడిన వారికి రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని అంటున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి ఇంట్లోనే తయారు చేసిన పండ్ల జ్యూస్ లు తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. మరి అవేంటో తెలుసుకుందాం.

- Advertisement -

యాపిల్ సైడర్ వెనిగర్..

- Advertisement -

థైరాయిడ్ సమస్య ఉన్న వారికి యాపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించే అవకాశం ఉంటుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఆకలి లేకుండా ఉంచగలుగుతుంది.

పసుపు కలిపిన పాలు..

గొరువెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల థైరాయిడ్ బాధితులకు ఉపశమనం కలుగుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం వల్ల దీనిని తాగితే పోషక విలువలను పెంచుతుంది.

క్యారెట్ జ్యూస్..

Also Read: పిల్లలను ఏసీ, కూలర్ల ముందు పడుకోబెట్టడం చాలా ప్రమాదం

క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల థైరాయిడ్ బాధితులకు ఉపశమనం కలుగుతుంది. క్యారెట్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల థైరాయిడ్ చికిత్సకు కూడా క్యారెట్, బీట్రూట్ తాగడం మంచిది.

మజ్జిగ..

తరచూ ఆహారంలో లేదా ఆహారం తర్వాత మజ్జిగను తాగడం మంచిది. థైరాయిడ్ బాధితులకు మజ్జిగ మంచి ఫలితాలు కలిగిస్తుంది. హైపోథైరాయిడిజంలోను మజ్జిగ మంటను తగ్గిస్తుంది.

బాదం పాలు..

థైరాయిడ్ బాధితులకు బాదం పాలు శరీరంలోని మంటను తగ్గిస్తుంది. పాలు లేదా పాల ఉత్పత్తులు తీసుకుంటే అలర్జీ ఉన్న వారు బాదం పాలు తీసుకోవడం మంచిది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News