Big Stories

Young Couple Marriage in Pakistan: ఇంత చిన్న వయసులో పెళ్లి ఏంట్రా..? వైరల్ అవుతున్న వీడియో

getting-married-at-a-young-age

- Advertisement -

Getting Married at a Young Age in Pakistan: నేటి సమాజంలోని యువత చదువు పూర్తి చేసుకొని..ఆ తరువాత మంచి ఫ్యాకేజీతో ఉద్యోగం దొరికే వరకు పెళ్లికి నో చెబుతున్నారు.ఇది ఈ కాలం అమ్మాయిల, అబ్బాయిల మాట.కానీ.. అందుకు భిన్నంగా ‘పెళ్లి చేస్తేనా చదువుకుంటా’ అంటోంది పాకిస్థాన్‌లోని ఓ టీనేజ్ గర్ల్. తనకు పెళ్లి చేయకపోతే చదువకునేదే లేదని తెగేసి చెప్పింది.

- Advertisement -

నిజానికి పాకిస్థాన్‌లో అమ్మాయికి పెళ్లికావాలంటే 16 ఏళ్లు నిండాలి.ఈ అమ్మాయికేమో 12 ఏళ్లే.అయినా కూడా పెళ్లి కావాల్సిందేనని పేరెంట్స్‌కు అల్టిమేటం జారీ చేసింది.దీంతో తల్లిదండ్రులు తల పట్టుకోవాల్సి వచ్చింది.చేసేదేమి లేక ఓ అబ్బాయితో పెళ్లి నిశ్చయం చేశారు.ఇక్కడ మరో విడ్డూరం ఏంటంటే ఆ అబ్బాయి ఏజ్ కూడా 13 ఏళ్లే. ఇది కూడా పాకిస్థాన్‌ రూల్స్‌ ప్రకారం చట్ట విరుద్ధం.అయినా కూడా పాకిస్థాన్‌ కదా..ఇలాంటి వింతలు,విడ్డూరాలు,విశేషాలు అక్కడ కొత్తేమీ కాదు.

Read More: అమెరికాలో ఎన్నారై కు ప్రతిష్ఠాత్మక అవార్డు.. ప్రకటించిన ది టెక్సాస్ అకాడమి ఆఫ్ మెడిసిన్

13 ఏళ్ల అబ్బాయి, 12 ఏళ్ల అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్న ఆశ్చర్యకరమైన మ్యాటర్ కాస్త ఆ నోట ఈ నోట పాకిస్థాన్ దేశంమంతటా పాకింది. ఇద్దరు మైనర్ల నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలోని సమాచారం ప్రకారం.. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి తన కుటుంబానికి అల్టీమేటం జారీ చేసింది. పెళ్లి చేస్తేనే తన చదువును కొనసాగిస్తానని చెప్పింది. దీంతో ఇరు కుటుంబాలు తమ పెళ్లికి అంగీకరించి ఘనంగా నిశ్చితార్థం చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త చూసిన నెటిజన్లు గరం గరం అవుతున్నారు. ఎంచక్కా.. చదువుకునే వయసులో పెళ్లి లొల్లి ఏందని ఫైర్ అవుతున్నారు.

Read also: మాల్దీవుల్లో వేలాది మంది భారతీయ సైనిక సిబ్బంది”.. ముయిజ్జా అన్ని అబద్ధాలే..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News