BigTV English

Pakistan Youtuber Murdered: ఇండియా-పాక్ మ్యాచ్‌పై వ్లాగ్.. పాకిస్తాన్ యూట్యూబర్ దారుణ హత్య!

Pakistan Youtuber Murdered: ఇండియా-పాక్ మ్యాచ్‌పై వ్లాగ్.. పాకిస్తాన్ యూట్యూబర్ దారుణ హత్య!

Pakistan Youtuber Saad Ahmed Murdered: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికీ ఎంత ఉద్విగ్నంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఒక విషాదం పాకిస్తాన్ లోని కరాచీలో జరిగింది. యువత ముఖ్యంగా రీల్స్, వ్లాగ్స్, వీడియోలు చేసేవారు అందరికీ ఈ ఘటన ఒక కనువిప్పులాంటిదని నెటిజన్లు అంటున్నారు.


విషయం ఏమిటంటే… పాకిస్తాన్ లోని కరాచీలో ఒక యూట్యూబర్.. అతని పేరు సాద్ అహ్మద్… తనేం చేశాడంటే..ఇండియా-పాక్ మ్యాచ్ సందర్భంగా ప్రజలు ఏం అనుకుంటున్నారు? వారి ఆసక్తిని తెలుసుకునేందుకు ఒక మార్కెట్ కి వెళ్లాడు. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. అతన్ని కూడా ఒపీనియన్ చెప్పమన్నాడు. దానికి తను అంగీకరించలేదు.

అయితే సాద్ అహ్మద్ ఊరుకోలేదు. అక్కడ రికార్డింగ్ చేస్తూ, సెక్యూరిటీ గార్డు చెప్పనంటున్నాడు, ఆసక్తి లేదంటున్నాడు? ఎందుకు లేదు? ఇండియా-పాక్ మ్యాచ్ అంటే ఆసక్తి లేనిది ఎవరికి? ఇలా అని అతని ముఖం మీద ముఖం పెట్టి, వద్దంటున్నా, మైక్ ని అతని ముఖంపై పెట్టి పదే పదే విసిగించేసరికి.. ఆ సెక్యూరిటీ గార్డుకి వళ్లు మండి, చేతిలో ఉన్న తుపాకి తీసుకుని ధనాధన్ ఆ కుర్రాడి మీద కాల్పులు జరిపాడు.


Also Read: UN Security Council: హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత 8 నెలలుగా బీకర పోరు.. కాల్పుల విరమణ ప్రణాళికకు ఆమోదం

తీవ్ర గాయాలపాలైన సాద్ అహ్మద్ ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే తను మరణించాడు. ఇండియా-పాక్ మ్యాచ్ కి ముందురోజు ఘటన జరిగింది. కాకపోతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తర్వాత పోలీసులు వెళ్లి ఆ సెక్యురిటీ గార్డుని అరెస్ట్ చేసి కారణం అడిగారు. దానికతడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా మైక్ ని ముఖానికి దగ్గరగా పెడుతూ వీడియో తీశాడు. నా చిరాకు, అసహనం, కోపం అన్నింటిని కామెడీగా రికార్డు చేస్తున్నాడు. నవ్వుతున్నాడు. ఆ క్షణం నా జీవితం అపహాస్యం అవుతుందని అనిపించింది. దాంతో సహనం కోల్పోయాను. దాంతో కాల్పులు జరిపానని అన్నాడు.

అయితే చాలామంది యూట్యూబర్లకి చెప్పేమాట ఏమిటంటే, మిమ్మల్ని మీరు ఎంత డీగ్రేడ్ అయినా చేసుకోండి. మీ మీద, మీ భార్యలు, మీ పిల్లల మీద ఎన్ని జోక్స్ అయినా వేసుకోండి. మీకు ఇష్టమై వీడియోలు చేసుకున్నారు.మీరు పిచ్చి గెంతులు గెంతారు. మీకు ఇవన్నీ నచ్చి చేశారు. అది మీ వ్యక్తిగతం కిందకి వస్తుంది.

Also Read: గ్రౌండ్ లో ఏడ్చిన పాక్ ఆటగాడు.. ఓదార్చిన రోహిత్ శర్మ

కానీ పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత అవతలివాళ్ల మనోభావాలు గౌరవించడం చాలా అవసరం. మీరు ఒపీనియన్ అడగండి..తప్పులేదు…అలాగే వాళ్లు సరదాగా చెబితే ఓకే, లేదూ, వద్దు అంటే మాత్రం, అస్సలు బలవంతం చేయవద్దని నెటిజన్లు చెబుతున్నారు. అవతలి వ్యక్తుల ప్రైవసీకి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని అంటున్నారు.

ఏమో అతను ఆ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మీకేం తెలుసు? వాళ్ల తండ్రి చనిపోయి ఉండవచ్చు, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కారణమై ఉండవచ్చు, భార్యభర్తల మధ్య గొడవలు జరిగి ఉండవచ్చు, ఇవేవీ తెలీకుండా ముఖం మీద మైక్ పెట్టి చెప్పు, చెప్పు అంటే ఇలాగే ఉంటుందని అంటున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×