Big Stories

Retina Problems : మీ కంటిలో ఈ లక్షణాలు ఉన్నాయా.. వెంటనే వైద్యుల వద్దకు లగెత్తండి!

Retina Problems
Retina Problems

Retina Problems : కళ్లు మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగం. దీని కారణంగానే ప్రపంచాన్ని చూస్తున్నాం. రంగులను గర్తిస్తున్నాం. అలానే రోజువారి మన పనులను చేసుకోగలుగుతున్నాం. కంటికి కొన్ని రకాల సమస్యలు వస్తుంటాయి. ఇందుకు కాలుష్యం, దుమ్ము, సూర్యరశ్మి లేదా ఇతర కారణాలు కావచ్చు. అంతేకాకుండా ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్‌, కంప్యూటర్‌తో గడపడం, టీవీ చూడటం వాటి వల్ల కూడా కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కంటి కండరాలు బలహీనపడతాయి. దీని ప్రభావం రెటీనాపై కూడా పడుతుంది.

- Advertisement -

కంటిలోని చాలా సమస్యలు రెటీనాలోనే సంభవిస్తాయి. దీని కారణం డయాబెటిస్, రెటీనోపతి వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కావచ్చు. మీ కంటిలో ఏదైనా సమస్య ఉండే వెంటనే వైద్యులను సంప్రదించండి. లేదంటే శాశ్వతంగా కంటిచూపుపోయే ప్రమాదం ఉంది. వయసు పెరిగే కొద్ది కూడా కంటి సమస్యలు అధికమవుతాయి.

- Advertisement -

Also Read : ముక్కు నుంచి రక్తస్రావం జరిగితే ఏమోతుందో తెలుసా..?

రెటీనా అంటే ఏమిటి?

రెటీనా అంటే కాంతిని సంకేతాలుగా మార్చి మెదడుకు పంపే కంటి భాగం. చిత్రాలను రూపొందిచడానికి మెదడు ఈ సంకేతాలను ఉపయోగిస్తుంది. రెటీనా అనేది కాంతి సెన్సిటివ్ కణాలతో రూపొందించబడింది. దీనిని ఫోటో రెసిప్టెర్ అని కూడా అంటారు. కంటిలో రెండు రకాల కంటి రెసిప్టర్లు ఉంటాయి. వీటిలో ఒకటి రాడ్లు కాగ, మరొకటి శంకువులు. తక్కువ వెలుతురులో చూడటానికి రాడ్లు బాధ్యత వహిస్తాయి. శంకువులు రంగు, అధిక రిజల్యూషన్‌కు బాధ్యత వహిస్తాయి.

రెటీనా వ్యాధులు లక్షణాలు

  • దృష్టి మసకగా ఉండటం.
  • కంటిలో తేలియాడే మచ్చలు లేదా గీతలు.
  • రంగులు అస్పష్టంగా కనిపిస్తాయి.
  • డైరెక్ట్‌గా చూడటం ఇబ్బందిగా ఉండటం.
  • రాత్రి చూపు ఇబ్బందిగా ఉండటం
  • రెటీనా వ్యాధి చికిత్సలు

కంటీ పరీక్షలు

  • విజువల్ అక్యూటీ టెస్ట్
  • ఐబాల్ ఒత్తిడి పరీక్ష
  • ఫండస్ పరీక్ష
  • ఆప్టికల్ కోహెరన్స్ టోమోగ్రఫీ
  • లేజర్ చికిత్సలు
  • శస్త్రచికిత్సలు

Also Read : మండే ఎండలో మట్టి కుండలో నీరు తాగితే ఏమోతుందో తెలుసా..?

రెటీనా వ్యాధి నివారణ

డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి పరిస్థితులను నియంత్రించడం ద్వారా ఈ సమస్య నుంచి చాలా వరకు బయటపడొచ్చు. అలానే స్మోకింగ్, ఆల్కహాల్‌ను మానుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ఆకుకూరలు, కూరగాయలు పండ్లను ఆహారంలో చేర్చుకోండి. శరీరానికి తగిన వ్యాయామం చేయండి. వీటి వల్ల అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు.

Disclaimer : ఈ కథనాన్ని నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని సమాచారంగా మాత్రమే భావించండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News