Big Stories

Pot Water Benefits : మండే ఎండలో మట్టి కుండలో నీరు తాగితే ఏమోతుందో తెలుసా..?

Pot Water Benefits
Pot Water Benefits

Pot Water Benefits : ఎండలు దంచికొడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లామంటే నెత్తి మలమల మాడుతుంది. రాత్రైన కాస్తా హాయిగా ఓ కునుకేద్దామన్నా.. ఉక్కపోతతో అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడింది. వేడి దెబ్బకి జనాలు అల్లాడుతున్నారు. అయితే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని నీటిని తాగుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఫ్రిజ్డ్‌లో ఉంచిన కూల్ వాటర్ తాగుతుంటే.. మరికొందరు మట్టి కుండలో నీటిని ప్రిఫర్ చేస్తున్నారు. కుండలో నీరు చల్లగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో కుండలు ఎక్కవగా కనిపిస్తాయి. మట్టి కుండలో నీరు తాగడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం.

- Advertisement -

కుండలోని నీరు సహజసిద్ధంగా చల్లబడుతుంది. అందుకే ఈ కుండలో నీరు శరీరానికి ఎటువంటి హాని చేయదు. అందువల్ల దగ్గు, జలుబు మీ దరిచేరవు. కుండలోని చల్లనీరు తృప్తిని కూడా ఇస్తాయి. ఈ నీటిని తాగడం వల్ల వేసవిలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. కానీ ఫ్రిడ్జ్‌లోని చల్లని నీరు తాగడం వల్ల ముఖ్యంగా దగ్గు, జలుబు బారిన పడతారు. దాహం కూడా తీరదు. శరీరం డీహైడ్రేట్ బారిన పడే ప్రమాదం ఉంది.

- Advertisement -

Also Read : అమ్మవారు వస్తే ఏం చేయాలి..?

అంతేకాకుండా ఎండాకాలంలో ఫ్రిడ్జ్ నీరు తాగడం వల్ల పిల్లలు, పెద్దలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. మట్టితో చేసిన కుండలో ఎన్నో మినరల్స్, సాల్ట్స్‌ ఉంటాయి. అలానే అందులో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ వంటి ఎనర్జీ దాగుంటుంది. ఇందులో నీరు నిల్వ చేయడం వల్ల ఈ గుణాలన్నీ కుండలోకి చేరుతాయి. కాబట్టి ఆరోగ్యంగా, హెల్దీగా ఉంటారు.

ఎండలో కాసేపు తిరిగినా.. వేడి గాలులకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడాలంటే కుండలో నీరు తాగాలని నిపుణుల చెబుతున్నారు. కుండలోని సహజమైన చల్లని నీరు శరీరంలోని గ్లూకోజ్‌ స్థాయుల్ని అదుపులో ఉంచుతాయి. ఎండల్లో బయటకు వెళ్లేటప్పుటు చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తీసుకెళ్తుంటారు. దీనికి బదులుగా మట్టి బాటిళ్లు యూజ్ చేయండి. ప్రస్తుతానికి ఇవి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Also Read : చక్కెర కన్నా బెల్లం మంచిదా..?

కుండలో నీరు ఎలా చల్లబడతాయనే విషయానికి వస్తే.. కుండ గోడల్లో మన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు ఉంటాయి. కానీ ఈ సన్నని రంధ్రాలు వల్ల నీరు బయటకు కారదు. కుండను బట్టీల్లో కాల్చినప్పుడే ఆ గోడల్లో సన్నని రంధ్రాలు సహజంగా ఏర్పడతాయి. ఈ రంధ్రాల వల్ల చెమట పట్టినట్లుగా నీరు చెమ్మగా కుండ నుంచి వస్తుంటాయి. నీరు ఆవిరి కావాలంటే కొంత ఎనర్జీ అవసరం. ప్రతి ఒక గ్రాము నీరు ఆవిరి కావాలంటే సుమారు 540 క్యాలరీల ఉష్ణం అవసరం అవుతుంది. ఈ ఉష్ణం.. ఆవిరయ్యే నీరు కుండగోడల నుంచి బయటకు వెళుతుంది. దీనివల్ల కుండ గోడలు చల్లబడతాయి. అందుకే కుండలో నీరు చల్లగా ఉంటాయి.

Disclaimer : ఈ కథనాన్నిఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించాం. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News