Night Skincare Routine: అందమైన చర్మాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి ?. గ్లోయింగ్ స్కిన్ కోసం వేలల్లో ఖర్చు చేసే వారు కూడా ఉంటారు. మీరు మీ చర్మంపై కఠినమైన రసాయనాలు ఉన్న స్కిన్ కేర్ ప్రొడక్స్ట్ వాడాల్సిన అవసరం లేదు. వాటితో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని సహజమైన పదార్థాలతో మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.
ఇవి చర్మాన్ని అందంగా, మెరిసేలా చేస్తాయి:
కొబ్బరి నూనె: కొబ్బరి నూనె చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. కొబ్బరి నూనె యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. రాత్రిపూట ప్రతి రోజు ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, మెరిసిపోతుంది.
అలోవెరా జెల్: అలోవెరా జెల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఇది చర్మపు చికాకును తగ్గిస్తుంది. అంతే కాకుండా దానిని హైడ్రేట్ గా ఉంచుతుంది. రాత్రి పడుకునే ముందు దీన్ని అప్లై చేయడం వల్ల ఉదయాన్నే గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.
తేనె: తేనె సహజమైన మాయిశ్చరైజర్. ఇది చర్మానికి తేమను, మెరుపును అందిస్తుంది. రాత్రి పడుకునే ముందు 10-15 నిమిషాలు ముఖానికి అప్లై చేసి కడిగేస్తే చర్మం మెరుగుపడుతుంది.
రోజ్ వాటర్: రోజ్ వాటర్ ఒక గొప్ప సహజ టోనర్. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా తాజాగా మారుతుంది. రాత్రిపూట దీన్ని అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా , తాజాగా మారుతుంది .
ఆల్మండ్ ఆయిల్: ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని లోతుగా పోషించి మృదువుగా చేస్తుంది. ప్రతి రోజు ఆల్మండ్ ఆయిల్‌తో రాత్రిపూట మీ ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయండి.
వేప నూనె: యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు వేప నూనెలో కనిపిస్తాయి, ఇది మొటిమలు మరియు ఇన్ఫెక్షన్ల నుండి చర్మాన్ని రక్షిస్తుంది . రాత్రిపూట దీన్ని అప్లై చేయడం వల్ల చర్మం తాజాగా , ఆరోగ్యంగా ఉంటుంది. వేప నూనె తరుచుగా ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. అంతే కాకుండా మచ్చలు కూడా రాకుండా ఉంటాయి. ప్రతి రోజు వేపనూనె వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
Also Read: పటికను వాడే బెస్ట్ మెథడ్ ఇదే.. ఎలాంటి చర్మ సమస్యలైనా పరార్
జోజోబా ఆయిల్ : ఈ నూనె చర్మం యొక్క సహజ నూనె వంటిది. ఇది చర్మానికి లోతుగా తేమను అందిస్తుంది. ఇది చర్మంలో తేమ, మృదుత్వాన్ని కాపాడుతుంది.
చమోమైల్ టీ: రెండు టీస్పూన్ల చమోమిలే టీ, నిమ్మరసం, ఒక టీస్పూన్ శనగపిండిని కలిపి రాత్రిపూట మీ ముఖానికి అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ సున్నితమైన చర్మాన్ని అందిస్తుంది. అంతే కాకుండా మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.