Alum For Skin: ప్రతి ఒక్కరు అందమైన మచ్చలేని చర్మాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారు బయట మార్కెట్‌లో దొరికే ఫేస్ ప్రొడక్ట్స్ వాడకుండా పటిక వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మీ చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం అవుతుంది. పటికలోని పోషకాలు చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలను తగ్గించి అందంగా మెరిసేలా చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న పటికను ఫేస్‌కు ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పటిక ప్రయోజనాలు:
చర్మానికి మేలు చేసే అనేక గుణాలు పటికలో ఉన్నాయి.
పటిక చర్మపు మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.
పటికలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి.
మొటిమలను తగ్గిస్తుంది: పటికలో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది. ఇది చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చర్మంపై ఉన్న అదనపు నూనెను తగ్గిస్తుంది.తద్వారా మొటిమలను తగ్గుతాయి.
చర్మాన్ని బిగుతుగా చేస్తుంది: పటిక చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ముడతలను తగ్గిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు చర్మాన్ని సాగేలా చేస్తుంది.
చర్మాన్ని కాంతివంతం చేస్తుంది: పటికలో సహజమైన బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి, ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో మరియు మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.
చర్మాన్ని శాంతపరుస్తుంది: పటిక చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది అంతే కాకుండా చర్మ సమస్యలు ఉన్న వారికి ఇది అద్భతంగా పనిచేస్తుంది.
చర్మానికి పోషణనిస్తుంది: పటికలో అనేక ఖనిజాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని పోషించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
చర్మంపై పటికను ఎలా ఉపయోగించాలి ?
1. పటిక, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్: 2 టీస్పూన్ల రోజ్ వాటర్‌లో 1 టీస్పూన్ పటిక పొడి కలపండి . ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
2. పటిక, ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్: 1 టీస్పూన్ పటిక పొడి, 2 టీస్పూన్ల ముల్తానీ మిట్టి, కొన్ని నీటిని వేసి ఒక బౌల్‌లో మిక్స్ చేసుకోండి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
3. పటిక, పెరుగు ఫేస్ ప్యాక్: 2 టీస్పూన్ల పెరుగులో 1 టీస్పూన్ పటిక పొడి కలపండి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడగేయాలి.
Also Read: బీట్ రూట్‌తో.. రెట్టింపు అందం మీ సొంతం
ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి:
పటికను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.
పటిక వాడితే అలర్జీ వస్తే ఉపయోగించకుండా ఉంటే మంచిది.
పొడి చర్మం ఉన్నవారు పటికను ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది చర్మాన్ని మరింత పొడిగా చేస్తుంది.
పటికను కళ్లకు తాకనివ్వకండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.