BigTV English
Advertisement

Fruit peels: కేవలం పండు మాత్రమే కాదు వీటి తొక్కలతో కూడా ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Fruit peels: కేవలం పండు మాత్రమే కాదు వీటి తొక్కలతో కూడా ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Fruit peels: ఆరోగ్యానికి పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు చాలా మేలు చేస్తాయి. ప్రస్తుతం ఉన్న కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. మార్కెట్లో లభించే ప్రతీది కల్తీది దొరకడంతో ఏం తినాలన్నా కూడా దానికి తగిన జాగ్రత్తలను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో ఎక్కువగా పండ్లు, ఆకుకూరలను తీసుకుంటుంటారు. పండ్లను తినే క్రమంలో చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. కొన్ని పండ్లను తొక్కతో తింటారు. మరికొన్ని పండ్లను మాత్రం తొక్క తీసి తింటారు.


ఇలా తినే పండ్లలో కొన్ని పండ్లతో పాటు వాటి తొక్కలో కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మాత్రం అందరికీ తెలియదు. అయితే నిపుణులు మాత్రం కొన్ని పండ్లతో పాటు వాటి తొక్కలతోను చాలా మేలైన ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. అయితే ఆ ప్రయోజనాలు ఏంటి, ఆ పండ్ల వివరాలు ఏంటో తెలుసుకుందాం.

కివి:


కివి పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా అనారోగ్యం సమయంలో కివిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. కివి కాస్త ఖరీదైనా కూడా అనారోగ్యానికి గురైన సమయంలో ముఖ్యంగా డెంగ్యూ వంటి జ్వరాల బారిన పడిన సమయంతో ప్లేట్లేట్లు తగ్గిపోయిన వారికి వాటికి పెంచడంలో తోడ్పడుతుంది. అంతేకాదు కివి పండు తొక్క గరుకుగా ఉంటుందని ఎవరు తినరు. కానీ ఆ తొక్కలో ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల గుజ్జుతో పాటు తొక్కను కూడా తీసుకోవడం మంచిది.

డ్రాగన్ ఫ్రూట్:

డ్రాగన్ ప్రూట్ కూడా కాస్త ఖరీదైనదే అయినా దీని తొక్కలో పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ ఫ్రూట్ తొక్కలో ఫైబర్, బీటాసైనిస్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల తొక్కను తీసుకుంటే బరువును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

జామ పండు:

జామ పండును తొక్కతో తిన్నా, మరికొంత మంది మాత్రం తొక్క తీసి తింటుంటారు. కానీ తొక్కతో తినడం వల్ల అందులో చాలా ప్రయోజనాలు ఉంటాయి. జామ తొక్కలో చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి కూడా ఇది సహాయపడుతుంది.

యాపిల్:

యాపిడ్ పండుతో పాటు యాపిల్ తొక్కలోను పోషకాలు ఉంటాయి. ఈ తొక్కలో ఉండే విటమిన్ సి, ఏ, కె, పొటాషియం, భాస్వరం, కాల్షియం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

Related News

Headache: క్షణాల్లోనే.. తలనొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కాలు ఇవే !

Guava Fruits: వింటర్ స్టార్ట్.. జామపండు తినకుండా వీళ్లని ఆపాల్సిందే!

Optimal Thyroid : థైరాయిడ్ సమస్యా? ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ !

Clove Benefits For Heart: లవంగాలతో గుండెకు మేలు.. ఇలా వాడితే బోలెడు బెనిఫిట్స్

Yogamudrasana: యోగముద్రాసన.. ఒత్తిడి పారిపోవాల్సిందే!

Indians Sperm Count: భారతీయులకు గుడ్ న్యూస్.. స్పెర్మ్ కౌంట్‌లో మనవాళ్లు తగ్గేదెలే

Raisins Soaked Milk: పాలు, ఎండు ద్రాక్ష కలిపి తింటే.. ఆశ్చర్యకర లాభాలు !

7 Days Skin Care: గ్లోయింగ్ స్కిన్ కావాలా ? 7 రోజులు ఈ టిప్స్ అవ్వండి చాలు !

Big Stories

×