BigTV English

Lungs Health: ఈ ఫుడ్స్ తో మీ లంగ్స్ దొబ్బేయటం ఖాయం!

Lungs Health: ఈ ఫుడ్స్ తో మీ లంగ్స్ దొబ్బేయటం ఖాయం!

Lungs Care


Foods to effect Lungs Health: దేశంలో కాలుష్యం సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. వాయు కాలుష్యం కొన్ని నగరాలకు అనేక ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఈ విషయంలో ఢీల్లీ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. నగరీకరణలో భాగంగా హైదరాబాద్, చైన్నై, బెంగళూరులో కూడా గాలిలో నాణ్యత తగ్గిపోతుంది. దీని ముఖ్య కారణం మనుషులే. కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం మరితం క్షీణిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉబ్బసం, దగ్గు, జలుబు వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి.

అయితే మన ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మనం తీసుకునే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మన ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు. కానీ, కొందరు కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులకు హాని కలిగించే ఆహారాన్ని తీసుకుంటున్నారు. వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఉప్పు

ఉప్పు ఆరోగ్యానికి హానికరం. ఇది మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజూ ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. అదే సమయంలో ఇది ఊపిరితిత్తులపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.

Read More: ఫైబర్ ఫుడ్స్‌.. అదిరిపోయే బెనిఫిట్స్..!

వేయించిన ఆహారం

ప్రస్తుత హడావిడి జీవనశైలి కారణంగా ప్రజలు వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు. అయితే ఈ ఆహారాన్ని తయారిలో వాడే నూనెలు ఊపిరితిత్తులకు హాని కలిగిస్తున్నాయి. వేయించిన ఆహారంలో ఉపయోగించిన నూనె మళ్లీ వాడటం వల్ల గుండె జబ్బులను కారణంగా మారుతుంది. అటువంటి ఆహారాన్ని తినడం మానేయండి.

పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయినప్పటికీ వాటిని అధికంగా తీసుకుంటే ఊపిరితిత్తులను
దెబ్బతీస్తాయి. పాల ఉత్పత్తుల్లో వెన్న ఎక్కువగా తింటే ఊపిరితిత్తులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

ధూమపానం

ధూమపానం వల్ల కలిగే నష్టాలు మనందరికీ తెలుసు. అయినా స్మోకింగ్‌కి మాత్రం దూరంగా ఉండము. ఇది ఊపిరితిత్తులకు విషంగా పనిచేస్తుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. సిగరెట్ తాగడం వల్ల మన ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదమే. మీ జీవితం ఆనందంగా ఉండాలంటే స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.

Read More: డీహైడ్రేషన్‌కు గురైతే.. మన శరీరంలో కనిపించే లక్షణాలు!

ఆల్కహాల్

ఆల్కహాల్ ఊపిరితిత్తులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనిలో ఉండే సల్ఫేడ్ ఆస్తమా లక్షణాలను పెంచుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఇథనాల్ ఊపిరితిత్తుల కాణాలను ప్రభావితం చేస్తుంది. కారణంగా న్యుమోనియా వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Disclaimer : ఈ సమాచారాన్ని ఆరోగ్య నిపుణుల సలహా మేరకు, పలు అధ్యయనాల ఆధారంగా ఈ కథనాన్ని రూపొందించాం.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×