BigTV English

Fiber : ఫైబర్ ఫుడ్స్‌.. అదిరిపోయే బెనిఫిట్స్..!

Fiber : ఫైబర్ ఫుడ్స్‌.. అదిరిపోయే బెనిఫిట్స్..!

fiber


Fiber Foods : ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యంగా తినడం అంత కష్టమైన విషయం కాదు. మీరు చేయాల్సిందల్లా మీ ఆహార పట్ల అప్రమత్తంగా ఉండాలి. శరీరానికి తగ్గా ఆహారం తీసుకోవడం ముఖ్యం. చాలామంది మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

అయితే.. మన జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉంటూ బరువును కంట్రోల్‌లో చేయడానికి సహాయపడే ఫైబర్‌ను తీసువడం లేదు. మన ఆహారంలోని ఫైబర్‌ పేగుల ద్వారా పెద్దపేగుల్లోకి వెళ్తుంది. ఇది మన పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మీరు డైట్‌ ఫైబర్‌ను సమృద్ధిగా తీసుకోవడానికి కొన్ని సింపుల్‌ టిప్స్‌ సహాయపడతాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.


READ MORE : విటమిన్ కె పొందాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి..!

పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం శాకాహారంతోనే లభిస్తుంది. ఇందులో అనేక రకాలు ఉంటాయి. ప్రధానమైనవి పీచులో నీటిలో కరిగేది, కరగనిది. ఫైబర్స్ గట్ మైక్రోబయోటాను మీడియేట్‌ చేస్తుంది, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూవారీ ప్రతిపాదించిన ఫైబర్‌ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఫైబర్‌ వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేస్తుంది. అంతేకాకుండా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది . లివర్‌ నుంచి పేగుల్లోకి వచ్చే కొలెస్ట్రాల్‌ను ఇది ఫిల్టర్ చేస్తుంది.

మీ డైట్‌లో ఫైబర్‌ తీసుకోవడానికి తృణధాన్యాలు తీసుకోండి. పాస్తా, వైట్‌ బ్రెడ్‌ వంటి వాటికి బదులుగా తృణధాన్యాలు తీసుకోండి. బ్రౌన్‌ రైస్‌, క్వినోవా, హోల్‌ వీట్‌ పాస్తా, ఓట్‌ వంటి తృణధాన్యాల్లో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. వీటివల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అలానే మీ జీర్ణక్రియ సున్నితంగా చేయడంలో సహాయపడతాయి. తృణధాన్యాలు మీ బరువును తగ్గిస్తాయి.

READ MORE : రాత్రిపూట జుట్టుకు నూనె రాస్తున్నారా..?

తాజా కూరగాయలు , పండ్లలో విటమిన్లు, మినరల్స్‌ వంటి ముఖ్యమైన పోషకాలతో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మీ డైట్‌లో రకరకాల పండ్లు చేర్చుకుండి. హెల్తీ సలాడ్స్‌, చాట్స్‌ తయారు చేసుకుని ఎంజాయ్‌ చేయండి. డైలీ ఒక్కసారైనా పండ్లు, కూరగాయలతో కూడిన భోజనం చేయండి. యాపిల్స్‌, నారింజ, బెర్రీలు, క్యారెట్లు, ఆకుకూరలు, బ్రకోలీలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది.

చిప్స్‌, జంక్‌ ఫుడ్‌ తినడానికి బదులుగా.. నట్స్‌, విత్తనాలు వంటి స్నాక్స్‌ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటుగా ప్రొటీన్‌, ఫైబర్‌ నిండుగా ఉంటాయి. వాల్‌నట్, బాదం, చియా గింజలు, పిస్తాపప్పులు, అవిసె గింజలు, గుమ్మడి గింజల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. వీటిని రోజూ మీ ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నించండి.

Disclaimer : ఈ సమాచారాన్ని మెడికల్ జర్నల్స్ ఆధారంగా మీ అవగాహన కోసం అందిస్తున్నాం.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×