BigTV English

Rose Water For Face: రోజ్ వాటర్‌లో ఈ ఒక్కటి కలిపి రాస్తే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం

Rose Water For Face: రోజ్ వాటర్‌లో ఈ ఒక్కటి కలిపి రాస్తే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం

Rose Water For Face: చాలా ఏళ్లుగా చర్మ సంరక్షణకు రోజ్ వాటర్ ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ ముఖానికి చాలా మేలు చేస్తుంది. అంతే కాకుండా విటమిన్ ఇ కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఈ రెండింటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి రోజ్ వాటర్, విటమిన్ ఇలను ముఖ సౌంతర్యం కోసం ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


విటమిన్-ఇతో రోజ్ వాటర్: రోజ్ వాటర్ విటమిన్-ఇ క్యాప్సూల్స్ రెండూ చర్మ సంరక్షణ చాలా ప్రసిద్ధి చెందాయి. ఈ రెండూ చర్మ సంరక్షణకు చాలా ఉపయోగపడతాయి. అయితే ఈ రెండింటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలను అందించవచ్చని మీకు తెలుసా. అవును, రోజ్ వాటర్ , విటమిన్-ఇ కలిపి అప్లై చేయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి.

రోజ్ వాటర్ యొక్క ప్రయోజనాలు:


చర్మాన్ని శాంతపరుస్తుంది: రోజ్ వాటర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై ఎరుపును తగ్గించడంలో సహాయపడతాయి.

చర్మాన్ని టోన్ చేస్తుంది: రోజ్ వాటర్ చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా దానిని టోన్ చేయడంలో సహాయపడుతుంది.

రంధ్రాలను మూసివేస్తుంది: రోజ్ వాటర్ చర్మం యొక్క రంధ్రాలను మూసివేయడంలో సహాయపడుతుంది. చర్మంపై అదనపు నూనెలను తగ్గిస్తుంది.

చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది: రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

విటమిన్-ఇ ప్రయోజనాలు:

యాంటీఆక్సిడెంట్- విటమిన్ ఇ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. అంతే కాకుండా చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.
చర్మాన్ని తేమగా చేస్తుంది- విటమిన్ ఇ చర్మంలో తేమను కాపాడడంలో సహాయపడుతుంది.

చర్మంపై డెడ్ స్కిన్ తొలగిస్తుంది- విటమిన్ ఇ చర్మంపై డెడ్ స్కిన్ తొలగిస్తుంది. అంతే కాకుండా మొటిమలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది – విటమిన్ ఇ ముడతలు, ఫైన్ లైన్స్ వంటి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది .

రోజ్ వాటర్ , విటమిన్ ఇ తో ఫేస్ ప్యాక్ :
కావలసినవి:
రోజ్ వాటర్- 2-3 స్పూన్లు

విటమిన్ – ఇ క్యాప్యూల్స్

అప్లై చేయు విధానం:
ఒక గిన్నెలో 2-3 స్పూన్ల రోజ్ వాటర్ తీసుకోండి. అందులో ఒక విటమిన్-ఇ క్యాప్సూల్ నూనెను పిండాలి. తర్వాత రెండింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన ముఖంపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో కడగేయండి.

Also Read: చలికాలంలో ఇలా చేస్తే.. గ్లోయింగ్ స్కిన్ గ్యారంటీ

రోజ్ వాటర్ , విటమిన్ ఇ క్యాప్సూల్స్ వల్ల కలిగే ప్రయోజనాలు:

చర్మానికి పోషణను అందిస్తుంది -రోజ్ వాటర్, విటమిన్ ఇ చర్మానికి పోషణను అందిస్తాయి.

 

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది- ఈ మిశ్రమం చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

చర్మాన్ని మృదువుగా చేస్తుంది – ఈ మిశ్రమం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

డార్క్ సర్కిల్స్‌ను తగ్గిస్తుంది- ఈ మిశ్రమం కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

సూర్యరశ్మి దెబ్బతినకుండా చర్మాన్ని రక్షిస్తుంది – విటమిన్ ఇలో ఉండే యాంటీఆక్సిడెంట్లు సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి.

మొటిమలను తగ్గిస్తుంది- రోజ్ వాటర్ యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్ ఇ యొక్క యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిసి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×