Vangalapudi Anitha On Jagan: ఎక్కడైనా స్కూల్స్, కాలేజీల వద్ద ర్యాగింగ్ లు చేయడం చూస్తూ ఉంటాం. పోలీసుల పుణ్యమా అంటూ ప్రస్తుతం ఆ ర్యాగింగ్ కూడా మాయమవుతోంది. కానీ అసెంబ్లీ వద్ద ర్యాగింగ్ తరహా కామెంట్స్ తో వైసీపీ కి చుక్కలు చూపిస్తున్నారు టీడీపీ నేతలు. అందులో తాజాగా హోం మంత్రి వంగలపూడి అనిత చేసిన కామెంట్స్ చూస్తే.. ఈ ర్యాగింగ్ మామూలు ర్యాగింగ్ కాదురా అయ్య అంటున్నారు టీడీపీ మాస్ నేతలు.
అసెంబ్లీ సమావేశాలకు మేము రాము. మాకు మైక్ ఇవ్వరు. ఇచ్చే ఉద్దేశం మీకు లేదు. మేము అందుకే రాము అంటూ.. ఇటీవల మాజీ సీఎం జగన్ కామెంట్ చేశారు. అలాగే తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోర్టు మెట్లు కూడా ఇక్కారు జగన్. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది ప్రభుత్వం.
ఇప్పటికే స్పీకర్ గా జగన్ బద్దశత్రువు లా గుర్తించబడ్డ అయ్యన్న పాత్రుడు ఆశీనులు కాగా, జగన్ డిప్యూటీ స్పీకర్ పదవితో జగన్ కు ఊహించని షాక్ ఇచ్చింది టీడీపీ. డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజును ఎంపిక చేశారు. ఇంకేముంది జగన్ అసెంబ్లీకి వచ్చినా.. ఈ ఇద్దరి ముందు ఒక ఎమ్మెల్యేగా కూర్చోవాల్సిన పరిస్థితి.
ఇలాంటి పరిస్థితిపై తాజాగా హోం మంత్రి వంగలపూడి అనిత కీలక కామెంట్స్ చేశారు. జగన్ తన డ్రామాలు ఆపాలని, అసెంబ్లీ లో ప్రతిపక్ష నేతగా జగన్ సరిపోరనే ఏపీ ప్రజలు 18 సీట్లకు బదులు 11 సీట్లు ఇచ్చారన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తకుండా జగన్ పారిపోతున్నారని, ప్రజాస్వామ్యంపై జగన్కు ఏమాత్రం గౌరవం లేకపోవడమే ఇందుకు కారణంగా అనిత అభివర్ణించారు.
రాష్ట్రంలో విభిన్న రీతిలో జగన్ అసెంబ్లీకి హాజరు కావడంపై, పందేలు కాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అది కూడా కేవలం రూ.11లు పందెంగా నిర్ధారించి, ప్రజలు ఈ తరహా ర్యాగింగ్ చేస్తున్నారని తమకు తెలిసిందన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో జగన్ సిద్దహస్తుడిగా చెప్పిన హోం మంత్రి, తన సొంత బాబాయి వివేకా హత్య దగ్గర నుండి, సోషల్ మీడియాలో బూతుల వరకు జగన్ చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ ను ప్రజలు గమనించారని అందుకే 11 సీట్లు మాత్రమే వైసీపీకి దక్కినట్లు హోంమంత్రి అన్నారు.
ఇలా హోమ్ మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జగన్ అసెంబ్లీకి రావడంపై కేవలం రూ. 11 లు పందెం కాస్తున్నారని చెప్పడం వెనుక, వైసీపీకి దక్కిన 11 సీట్లే కారణమని చర్చ సాగుతోంది.
నిన్న 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు.. పులివెందుల ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడొచ్చు.. ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ లు, ఇంట్లో కూర్చుని వీడియోలు ఎందుకు ?
స్పీకర్ అయ్యన్న గారు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కానున్న రఘురామరాజు గారు మీకు మైక్ ఇస్తారు, భయపడకుండా అసెంబ్లీకి రండి… pic.twitter.com/OtEx5ui5mq
— Telugu Desam Party (@JaiTDP) November 14, 2024