Hand Veins : చాలా మందికి చేతుల్లో నరాలు ఉబ్బి ఉంటాయి. మీరు కూడా ఇది గమనించే ఉంటారు. చేతుల్లో నరాలు కనిపించడం సాధారణ విషయం. సాధారణంగా ఇది ఎటువంటి సమస్యకు కారణం కాదు. కానీ కొందరికి చేతుల్లో నరాలు కనిపంచడం పెద్ద సమస్యకు కారణం కావచ్చు. చేతుల్లో ఉబ్బిన నరాలు మీ ఆరోగ్యం గురించి చెబుతాయి. కొందరి చేతుల్లో ఇవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. ఉబ్బిన నరాలు ఎటువంటి అనారోగ్య సమస్యలకు సంకేమో ఇప్పుడు తెలుసుకుందాం.
చేతుల్లో నరాలు కనిపించడం ఏ వ్యాధులు లక్షణాలు?
శరీర ఉష్ణోగ్రత పెరుగుదల
శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చేతి నరాలు ఉబ్బవచ్చు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరం చల్లబరచడానికి చర్మం ఉపరితలం వైపు రక్తాన్ని పంపుతుంది. దీని కారణంగా చేతులు, కాళ్లలో నరాలు ఉబ్బుతాయి.
Also Read : షుగర్‌కి సరైన మెడిసిన్ ఇదే..!
కష్టపడి పనిచేయడం
మీరు మీ చేతులతో చాలా శ్రమతో కూడిన పని చేసినప్పుడు.. ఈ భాగంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని కారణంగా రక్తపోటు పెరుగుతుంది. అలానే చేతుల్లో సిరలు ఉబ్బుతాయి. చాలా మంది మల్లయోధులు, వెయిట్ లిఫ్టర్లు లేదా ఇతర క్రీడాకారులలో పెరిగిన కండరాలతో పాటు, వారి చేతుల్లో నరాలు కూడా ఉబ్బినట్లు కనిపిస్తాయి.
పెరుగుతున్న వయస్సు
పెరుగుతున్న వయస్సుతో శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. దీని ప్రత్యక్ష ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ చర్మం వదులుగా సన్నగా మారడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో క్రింద ఉన్న నరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే వృద్ధుల చేతులు, కాళ్లపై నరాలు కనిపిస్తాయి.
బరువు తగ్గడం
బరువు తగ్గడం వల్ల చేతుల్లో నరాలు కూడా కనిపిస్తాయి. శరీరంలో కొవ్వు తగ్గడం వల్ల చర్మం సన్నగా మారి లోపల ఉండే నరాలు బయటకు వచ్చి చర్మ పొరపైకి వస్తాయి. అందువల్ల చిన్న వయస్సులోనే సిరలు కనిపిస్తే బరువు గురించి జాగ్రత్త వహించాలి. ఎందుకంటే తక్కువ బరువు ఇతర సమస్యలకు కారణమవుతుంది.
జన్యుపరమైన సమస్య
చేతుల్లో నరాలు కనిపించడం కూడా జన్యుపరంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులకు ఈ లక్షణం ఉంటే మీకు కూడా ఉండవచ్చు. మీ తల్లిదండ్రులకు లేదా మీ రక్తసంబంధంలో ఉన్నవారికి ఈ రకమైన సమస్య ఉంటే మీరు కూడా అలాంటి నరాలను చూడవచ్చు.
Also Read : మీ బొడ్డు కుండలా మారుతుందా..?
చికిత్స
Disclaimer : ఈ కథనాన్ని నిపుణుల సలహాల మేరకు, ఇంటర్నెట్‌లోని సమాచారం ఆధారంగా అందిస్తున్నాం. దీనిని అవగాహనగా మాత్రమే భావించండి.