Big Stories

Egg Yellow or White: కోడిగుడ్డులోని పచ్చసొన తింటే కొవ్వు పెరుగుతుందా..?

Benefits of Egg Yellow: కోడిగుడ్డు అంటే పోషకాలకు పెట్టింది పేరు. ప్రతీ రోజూ కోడిగుడ్డు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ కోడిగుడ్డును తినే ఆహారంతో పాటుగా తీసుకోవాలి. ముఖ్యంగా ఉడకబెట్టిన గుడ్లను తినడం వల్ల మాత్రమే ప్రయోజనాలు ఉంటాయి. తరచూ బ్రేక్ ఫాస్ట్ లో ఉడకబెట్టిన కోడిగుడ్డును తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. అయితే చాలా మంది కోడిగుడ్డును తినడానికి ఇష్టపడినా అందులోని పైన ఉండే తెల్లదాన్ని మాత్రమే తింటుంటారు. లోపల ఉండే పచ్చ సొనను తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని దానిని తినకుండా వదిలేస్తారు. అయితే అది ఎంత వరకు నిజం, దీనిపై నిపుణులు ఏం అంటున్నారో తెలుసుకుందాం.

- Advertisement -

కోడిగుడ్డులోని పచ్చసోనను కూడా తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. గుడ్డులో కాల్షియం, విటమిన్ బీ2, బీ12, డీ, ఏ, సెలీనియం, బయోటిన్, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కోడిగుడ్డును తరచూ తినడం వల్ల శరీరానికి శక్తిని ఇస్తుంది. కండరాలను బలోపేతం చేసేందుకు కూడా తోడ్పడుతుంది. ముఖ్యంగా చర్మం, జుట్టు వంటి వాటికి కోడిగుడ్డును తీసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే కోడి గుడ్డులోని పచ్చసొనను కూడా తినాలని నిపుణులు చెబుతున్నారు. పచ్చసొనలో పది రకాల పోషక విలువలు ఉంటాయని అంటున్నారు.

- Advertisement -

Also Read: Moisturisers Injections: మాయిశ్చరైజర్ ఇంజెక్షన్లు చర్మానికి మంచివేనా..?

పచ్చసొనలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్లకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాదు పచ్చసొనలో విటమిన్ ఈ, డీ, కే కూడా ఉంటాయి. ఇవి శరీర ఎదుగుదలకు మెరుగ్గా పనిచేస్తాయి. అయితే శరీరానికి గాయాలు అయినపుడు వాటిని తగ్గించేందుకు విటమిన్ కే ఉపయోగపడుతుంది. జుట్టు, గోళ్లు, చర్మం వంటి అనేక సమస్యలకు గుడ్డులోని పచ్చ సోన ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News