Fridge Organisation Tips: చలికాలంలో మనకు తాజా, పోషకాహారంతో కూడిన కూరగాయలు అవసరం. కానీ మనం ఫ్రిజ్‌లో అనేక కూరగాయలను ఈ సీజన్ లో నిల్వ ఉంచుతాము. కొన్ని రకాల కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడం ఆరోగ్యానికి హానికరం. చలికాలంలో ఫ్రిజ్‌లో ఏ కూరగాయలకు నిల్వ చేయకూడదు. ఎందుకు అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళదుంపలు, ఉల్లిపాయలు:
బంగాళదుంపలతో పాటు ఉల్లిపాయలను వంటకాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వాటిని ఫ్రిజ్‌లో ఉంచాలనే ఆలోచన కూడా చాలా మందికి వస్తుంది. కానీ ఇది చెడు అలవాటు అని గుర్తుంచుకోండి. బంగాళదుంపలు, ఉల్లిపాయలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల వాటి పోషకాలు తగ్గుతాయి. అంతే కాకుండా వాటి రుచి కూడా తగ్గుతుంది.
చల్లటి వాతావరణంలో బంగాళదుంపలను ఉంచడం వల్ల వాటిలో చక్కెర శాతం పెరుగుతుంది.ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అంతే కాకుండా బంగాళాదుంపలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల అవి మొలకెత్తుతాయి. మొలకెత్తిన బంగాళదుంపలను తినడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని వాసన, రుచిలో కూడా మార్పులు వస్తాయి. ఉల్లిపాయలను చల్లని వాతావరణంలో ఉంచినప్పుడు, అవి త్వరగా కుళ్ళిపోతాయి. అంతే కాకుండా బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి ఉల్లిపాయలను తినడం వల్ల అతిసారం, ఇతర కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
పచ్చని ఆకు కూరలు:
చలికాలంలో బచ్చలికూర, మెంతి కూర, ఆవాల కూర లాంటివి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఆకుకూరలు తరచుగా సీజన్‌ను బట్టి సులభంగా అందుబాటులో ఉంటాయి. కానీ ఈ ఆకు కూరలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం మంచిది కాదు.
ఆకు కూరలు త్వరగా పాడవుతాయి. రిఫ్రిజిరేటర్‌లో ఉంచినప్పుడు ఆకులు త్వరగా వాడిపోతాయి. అంతే కాకుండా వాటిలో పోషణ కూడా తగ్గుతుంది.
మెంతి కూర: ఈ ఆకులను ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని ఎక్కువ కాలం చల్లని వాతావరణంలో ఉంచితే పోషకాలు లోపించి త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది.
Also Read: శరీరంలో ప్రొటీన్ లోపిస్తే.. కనిపించే లక్షణాలు !
బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చి ఆకు కూరలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి పాడవుతాయి. అంతే కాకుండా వాటి పోషణ కూడా తగ్గుతుంది. ఈ కూరగాయలను చల్లని , పొడి ప్రదేశంలో ఉంచడం మంచిది.