BigTV English

Virat Kohli – Sydney: పబ్బుకు వెళ్లిన కోహ్లీ, అనుష్క శర్మ…!

Virat Kohli – Sydney: పబ్బుకు వెళ్లిన కోహ్లీ, అనుష్క శర్మ…!

Virat Kohli – Sydney: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో ( Border-Gavaskar Trophy 2024/25 ) భాగంగా… ప్రస్తుతం టీమిండియా…. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఐదు టెస్టులు జరుగుతాయి. ఇందులో ఇప్పటికే నాలుగు టెస్టులు పూర్తి అయ్యాయి. ఇందులో టీమిండియా ఒకటి గెలవగా… మరో రెండు మ్యాచ్లు ఆస్ట్రేలియా గెలిచి.. లీడింగ్ లో ఉంది. ఐదవ టెస్టు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో…. టీమిండియా ప్లేయర్లు న్యూ ఇయర్… వేడుకల్లో పాల్గొన్నారు.


Also Read: Travis Head: దిగివచ్చిన హెడ్…వేలుపెట్టడం వెనుక అసలు కారణం ఇదేనట ?

ముఖ్యంగా విరాట్ కోహ్లీ అలాగే ఆయన భార్య అనుష్క శర్మ…. ఇద్దరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. సిడ్నీలో… ఉన్న ఓ పబ్బుకు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) దంపతులు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ లో… విరాట్ కోహ్లీ అలాగే ఆయన భార్య అనుష్క శర్మ ( Anushka  Sharma) మెరిశారు. ఇద్దరు ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని.. సిడ్నీ వీధుల్లో తిరిగారు.


అంతేకాదు సిడ్నీలోని ఓ పబ్బుకు విరాట్ కోహ్లీ దంపతులు వెళ్లడం జరిగింది. విరాట్ కోహ్లీ ( Virat Kohli ) దంపతులతో పాటు దేవదత్ పడక్కర్ కూడా ఉన్నాడు. అతను కూడా బ్లాక్ డ్రెస్ లోనే ఉండడం జరిగింది. అయితే పబ్బులోకి వెళ్లేందుకు…. ఇలా ముగ్గురు బ్లాక్ డ్రెస్ వేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.

బోర్డర్ గవాస్కర్ 2024 ట్రోఫీలో…. బ్యాటింగ్ చేయడం చేతకాని విరాట్ కోహ్లీ…. పబ్బులకు వెళ్లడం, అక్కడ ఎంజాయ్ చేయడం దారుణం అంటూ ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. మొదట టీమిండియా గెలిపించిన తర్వాత పార్టీ చేసుకోవాలి పుష్ప అంటున్నారు. ఇక విరాట్ కోహ్లీ దంపతులతో పాటు టీమిండియా ప్లేయర్లు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

సర్ఫరాజ్ ఖాన్ , గిల్, హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, హర్షిత్ రానా వీళ్లంతా వేరే రిసార్ట్ కి వెళ్లి ఎంజాయ్ చేసినట్లు ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే రోహిత్ శర్మ మాత్రం… న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడ కనిపించలేదు. రూమ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Rohit Sharma – Virat – Bumrah: క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోనున్న రోహిత్, కోహ్లీ.. బుమ్రా కూడా?

ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదవ టెస్టు… సిడ్ని వేదికగా జరగనుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరి పై వేటు వేసి యంగ్ స్టార్లకు ఛాన్స్ ఇవ్వాలని… గౌతమ్ గంభీర్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో… ఫ్యాన్స్ అందరిలోనూ టెన్షన్ నెలకొంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంటులో…. టీమిండియా స్థానం సంపాదించుకోవాలంటే కచ్చితంగా సిడ్నీ టెస్టుల్లో గెలవాల్సి ఉంది. కాబట్టి రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీని ఆడించాలని మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు.

 

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×