Teeth: దంతాలు తెల్లగా, మెరుస్తూ ఉంటే అవి మన అందాన్ని రెట్టింపు చేస్తాయి. కానీ అవి పసుపు రంగులోకి మారితే నవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. నిజానికి, సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. ఇలా రంగు మారిన పళ్లను పట్టించుకోకపోతే.. ఇది మీ నోటి ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తుంది.
పళ్లు రంగు మారితే మీరు ఒకరి ముందు సరిగ్గా నవ్వడానికి కూడా వెనుకాడతారు. అయితే.. ఈ సమస్య ఎదురయినప్పుడు దీన్ని వదిలించుకోవడానికి వేలల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని హోం రెమెడీస్ వాడటం వల్ల కూడా మీ దంతాలను అందంగా మార్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ దంతాలు మెరుస్తూ ఉండటమే కాకుండా దృఢంగా మారుతాయి. దంతాలను మెరిసేలా చేయడానికి ఎలాంటి హోం రెమెడీస్ వాడాలి. అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దంతాలు తెల్లబడటం కోసం హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. పళ్లను సరిగ్గా పట్టించుకోకపోతే పసుపు రంగులోకి మారుతాయి. ఇలాంటి సమయంలోనే
దంతాలు మెరిసేలా చేయడానికి ఇంటి చిట్కాలు పాటించాలి.
కొబ్బరి నూనె :
కొబ్బరి నూనె దంతాలను తెల్లగా చేస్తుంది. కొబ్బరి నూనె చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది దంతాలను మెరిసేలా చేయడంలో కూడా సహాయపడుతుంది. రోజు కొబ్బరినూనెతో దంతాలను మసాజ్ చేయాలి. దీంతో కొన్ని రోజుల్లోనే పళ్లపై ఉన్న పసుపు రంగు పోతుంది. ఇదే కాకుండా.. ఈ నూనె దంతాలను కుళ్ళిపోకుండా రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
ఆవనూనెతో రాక్ సాల్ట్ :
మీరు కూడా పసుపు రంగు దంతాల సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లయితే.. మీరు తప్పనిసరిగా ఆవాల నూనె, రాళ్ల ఉప్పును పళ్లు తెల్లగా మార్చుకోవడానికి వాడాలి. ఇవి పసుపు రంగులో ఉన్న పళ్ల యొక్క రంగు మార్చడంలో సహాయపడతాయి. రాళ్ల ఉప్పులో యాంటీ బాక్టీరియల్ గుణాలు, అయోడిన్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, క్లోరైడ్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది దంతాలను శుభ్రపరచడంలో ఉపయోగపడుతుంది. మీరు దీన్ని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
నిమ్మకాయ, బేకింగ్ సోడా:
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది దంతాలను మాత్రమే కాకుండా ముఖాన్ని కూడా మెరుసేలా చేస్తుంది. కాస్త నిమ్మరసంలో చిటికెడు బేకింగ్ సోడా కలిపి బ్రష్ సహాయంతో దంతాలను శుభ్రం చేసుకుంటే.. కొద్ది రోజుల్లోనే తేడా కనిపిస్తుంది. మీరు బ్రష్ సహాయంతో మీ దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. అయితే దీనిని వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే ఉపయోగించాలని గుర్తుంచుకోండి.
Also Read: ఒత్తైన జుట్టు కావాలా ? అయితే ఇవి వాడండి
వేప టూత్పిక్:
వేపతో మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వేప పళ్ళను కూడా మెరిసేలా చేస్తుంది. నేటికీ గ్రామాల్లో వేపతో పళ్లు తోముకోవడం మీరు చూసే ఉంటారు. నిజానికి, వేప టూత్‌పేస్ట్ దంతాలను తెల్లగా చేయడంలో సహాయపడుతుంది . అంతే కాకుండా వాటిని బలంగా చేస్తుంది.
పసుపు రంగు దంతాలు ఈ వ్యాధులను సూచిస్తాయి:
చిగురువాపు
క్యాన్సర్ మూలం
కాలేయ వ్యాధి
కాల్షియం లోపం
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.