BigTV English

Tomato For Face: ఇంట్లోనే టమాటోలతో ఇలా చేస్తే.. మీ ముఖం తెల్లగా మెరిసిపోద్ది

Tomato For Face: ఇంట్లోనే టమాటోలతో ఇలా చేస్తే.. మీ ముఖం తెల్లగా మెరిసిపోద్ది

Tomato For Face: టమాటో ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా యవ్వనంగా మారుస్తాయి. అందుకే చర్మ సంరక్షణలో టమాటోను కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. టమాటోతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లు ముఖాన్ని అందంగా మారుస్తాయి. అంతే కాకుండా ముఖంపై ఉన్న జిడ్డను తొలగిస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న టమాటో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


1.టమాటో, తేనెతో ఫేస్ ప్యాక్:

కావలసినవి:
పండిన టమాటో- 1
తేనె- 1 టీస్పూన్


తయారీ విధానం: ముందుగా టమాటోలను కడిగి పేస్ట్ లాగా చేయాలి. అందులో తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన ముఖంపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కడగాలి.

ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. టమాటో వృద్ధాప్య సమస్యను తగ్గిస్తుంది. ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. తేనె మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.

2. టమాటో , బియ్యప్పిండితో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
పండిన టమాటో – 1
బియ్యం పిండి- 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం: టమాటోలను మెత్తగా చేసి అందులో బియ్యప్పిండి వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.తరువాత చల్లటి నీటితో కడగాలి.

ఈ ఫేస్ ప్యాక్ మృత చర్మ కణాలను క్లియర్ చేయడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ముఖంపై మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.

3. టమాటో, నిమ్మకాయ ఫేస్ ప్యాక్:
కావలసినవి:
1 పండిన టమోటా, 1/2 నిమ్మరసం

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదులో టమాటోలను మెత్తగా చేసి అందులో నిమ్మరసం వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కడగాలి.

టమాటో, నిమ్మరసం రెండూ చర్మ రంగును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని ఉపయోగించడం వల్ల అనేక చర్మ సమస్యలు దూరం అవుతాయి.

4. టమాటో, శనగపిండి ఫేస్ ప్యాక్:

కావలసినవి:
పండిన టమోటా-1
శనగపిండి- 1 టీస్పూన్

తయారీ విధానం: టమాటోలను మెత్తగా చేసి అందులో శెనగపిండి వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. చల్లటి నీటితో కడగాలి.

టమాటో, శనగపిండి యొక్క ఫేస్ ప్యాక్ కూడా మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే, దీని ఉపయోగం మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Also Read: హెన్నాలో ఇవి కలిపి అప్లై చేస్తే.. జీవితంలో తెల్ల జుట్టు రాదు తెలుసా ?

టమాటో ఫేస్ ప్యాక్ ప్రయోజనాలు:

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
మొటిమలు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది .
చర్మానికి పోషణనిచ్చి యవ్వనంగా మార్చుతుంది.
చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి:
ఈ ఫేస్ ప్యాక్‌లను వారానికి 2-3 సార్లు ఉపయోగించండి.
ఈ ఫేస్ ప్యాక్‌లను అప్లై చేసిన తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
మీ చర్మం సున్నితంగా ఉంటే, ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయండి.
నిమ్మరసం అప్లై చేసిన తర్వాత నేరుగా సూర్యకాంతిలో బయటకు వెళ్లవద్దు.

Related News

Fat Lose Tips: 99% ప్రజలకు తెలియని ఫిట్‌నెస్ రహస్యాలు.. 2 వారాల్లో ఫ్యాట్ తగ్గించుకునే ట్రిక్స్

Fruitarian Diet: పండ్లు మాత్రమే తింటూ.. యువతి సరికొత్త డైట్, చివరికి ప్రాణాలే పోయాయ్!

Potato for Face: ముఖానికి ఆలుగడ్డ రాస్తే.. ఇలా అవుతుందా?

Type-2 Diabetics: ఇంట్లోని ఉల్లిగడ్డతో ఒంట్లోని డయాబెటిస్ తరిమికొట్టొచ్చా? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Sorakaya Vadalu: కరకరలాడే సొరకాయ వడలు.. ఎలా తయారు చేయాలో తెలుసా ?

Veg Pulav Recipe:హెల్తీ, టేస్టీ వెజ్ పులావ్ .. క్షణాల్లోనే రెడీ అవుతుంది !

Lipstick Side Effects: లిప్ స్టిక్ తెగ వాడుతున్నారా ? క్యాన్సర్ రావొచ్చు జాగ్రత్త !

High Blood Pressure: బీపీని తగ్గించడానికి.. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ?

Big Stories

×