Big Stories

Lemon Water Or Coconut Water: నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

Lemon Water Or Coconut Water: ఎండలు మండిపోతున్నాయి. బాడీ డీహైడ్రేట్ అవకుండా ఉండేందుకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, కూరగాయలు, జ్యూస్ లను తీసుకుంటుంటాం. అయితే ముఖ్యంగా కూల్ డ్రింక్స్, చెరుకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటివి మరింత ఎక్కువగా తీసుకుంటాం. అయితే ఇందులో ముఖ్యంగా ఎండ నుంచి ఉపశమనం కోసం కొబ్బరి నీళ్లు, నిమ్మరసాన్ని మాత్రమే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని చాలా మందికి తెలియదు. ఆరోగ్య నిపుణులు ఈ రెండింటిలో ఏది మంచిదో చెబుతున్నారు.

- Advertisement -

మంచి నీటి కంటే వ్యాయామం చేసే వారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిదని పేర్కొంటూ 2018లో జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ జర్నల్ లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఎందుకంటే బాడీని డీహైడ్రేటెడ్ గా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు చాలా ఉపయోగపడతాయి. ఇక సమ్మర్ లోని ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కొబ్బరి నీళ్లు మంచివని తెలిపారు. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లను పొందవచ్చు. కొబ్బరినీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లతో శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు.

- Advertisement -

విటమిన్ సీ ఎక్కువగా ఉండే నిమ్మకాయ నీటితో రోగనిరోధక శక్తిని పెంచే కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో నిమ్మరసం తాగడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. నిమ్మ రసం తాగడం వల్ల మూత్రపిండాల్లోని రాళ్లు రాకుండా కూడా చూసుకోవచ్చు. ఇక జీర్ణక్రియ వ్యవస్థను కూడా నిమ్మరసం త్వరగా మెరుగుపరుస్తుంది. అయితే నిమ్మరసం, కొబ్బరి నీళ్లు రెండింటిలో ఏది బెటర్ అని చూస్తే ఏది తాగినా మంచి ప్రయోజనాలు ఉంటాయి. రెండు కూడా సమానంగా పనిచేస్తాయి. అయితే ప్రెగ్నెంట్ గా ఉన్నవారికి కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. ఇక షుగర్ వ్యాధితో ఇబ్బంది పడే వారికి మాత్రం నిమ్మరసం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News